Mahesh Babu: 3 నెలలు కెనడా.. 4 సంవత్సరాలు ఆఫ్రికా.. మహేశ్ మాయం..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు 3 నెలలె స్పెషల్ ట్రైనింగ్ కి సిద్దపడుతున్నాడు. రాజమౌళి సినిమా అంటే హీరో ఎవరైనా కనీసం ఐదారు నెలలు లుక్ మార్చుకునేలా స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవటం కామన్.. అలా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటూ మూడు నెలలు కెనడాలోని మంచు ప్రాంతలో ఐస్ జిమ్ లో జాయిన్ కాబోతున్నాడట మహేశ్.

The superstar is going to Canada and Africa for fitness for Mahesh Babu's film directed by Rajamouli
ఐస్ జిమ్ లో వర్కవుట్స్ చేస్తే 8నెలల్లో వచ్చే ఔట్ పుట్ 3 నెలల్లో వస్తుందనేది రాజమౌళి ప్లాన్ అని తెలుస్తోంది. సో ఇది గుంటూరు కారం షూటింగ్ పూర్తయ్యాకే మొదలయ్యే కోర్స్ అని ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం. దీంతో మార్చ్ వరకు మహేశ్ తో రాజమౌళి మూవీ షూటింగ్ షురూ కాదని తేలిపోయింది.
ఇక ఆఫ్రికాలో 4 ఏళ్లు రెండు భాగాల షూటింగ్ తో గడపబోతున్నాడు మహేశ్ బాబు. సో గుంటూరు కారం పూర్తయ్యాక, రాజమౌళి మూవీ మొదలైతే, 2028 వరకు మహేశ్ మరో సినిమాకు అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అంతేకాదు త్రిబుల్ ఆర్ 2 ని 2029 లో ప్లాన్ చేసి 2030 లో రిలీజ్అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.