పోలీసులకే వణుకు పుట్టించిన దొంగ.. ఎవరీ టైగర్ నాగేశ్వరరావు ?
స్టువర్ట్‌పురం.. దక్షిణాదిలో దొంగతనాలకు అడ్డా. ఇప్పటికీ స్టువర్ట్‌పురం దొంగల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అలాంటి స్టువర్ట్‌పురాన్ని ఏలిన దొంగే టైగర్ నాగేశ్వరరావు. ఇప్పుడీయన పేరు మీదో సినిమా వస్తోంది. అందులో రవితేజ యాక్ట్ చేస్తున్నాడు. పులిని వేటాడే పులి అంటూ పేలిన డైలాగ్.. సినిమా మీద మరిన్ని అంచనాలు క్రియేట్ చేసింది.

Raviteja Make Real Life Movie
దీంతో ఎవరీ టైగర్ నాగేశ్వరరావు అని తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. టైగర్ నాగేశ్వరరావు అసలు పేరు.. గరిక నాగేశ్వరరావు. టైగర్ అని, ఆంధ్ర రాబిన్‌హుడ్ అని పిలిచేవారు ఒకప్పుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఒడిశాలాంటి రాష్ట్రాల్లోనూ టైగర్ నాగేశ్వరరావు చాలా ఫేమస్. గరిక నాగేశ్వరరావు అలియాస్ టైగర్ నాగేశ్వరరావుకు మొత్తం ముగ్గురు అన్నాదమ్ములు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమను.. జనాలు కనీసం పట్టించుకోలేదని, మనుషులుగా గుర్తించలేదన్న కసితో.. దొంగతనాలు ప్రారంభించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌లాంటి రాష్ట్రాల్లో ఈ ముఠా పెద్ద ఎత్తున దొంగతనాలు చేసింది. 19741లో కర్నూలు జిల్లా బనగానపల్లిలో వీళ్లు చేసిన బ్యాంక్ దోపిడీ.. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ. దాదాపు 35లక్షల విలువైన బంగాన్ని ఎత్తుకెళ్లారు. 1970-80లో వరుస దొంగతనాలతో పోలీసులకు నిద్ర లేకుడా చేశాడు టైగర్ నాగేశ్వరరావు. ఐతే అతను చెడ్డ దొంగ కాదని.. ఉన్నోడిని కొట్టి లేనోడికి పెట్టేవాడనే పేరు ఉంది. జైళ్ల నుంచి తప్పించుకోవడంలో నాగేశ్వరరావు తర్వాతే ఎవరైనా.
కట్టుదిట్టమైన భద్రత ఉండే చెన్నై జైలు నుంచి తప్పించుకున్న తీరుతో.. ఆయనను టైగర్ అని పిలవడం మొదలుపెట్టారు. పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు… 1987లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. కాల్పుల్లో చనిపోయే సమయానికి టైగర్ నాగేశ్వరరావు వయసు 27 ఏళ్లు మాత్రమే ! ఈయన జీవితం ఆధారంగానే ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు మూవీ తెరకెక్కుతోంది. సినిమాలో ఇంకెలాంటి సంచలన విషయాలు చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది.