చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ అదిరిపోయింది..! మీరూ చూసేయండి..
చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.

చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మీద ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చిరంజీవి ముచ్చటపడి మరీ అనిల్ తో సినిమా చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో తన వింటేజ్ కామెడీ మిస్ అవుతుందని చాలా ఫీల్ అవుతున్నాడు మెగాస్టార్. ఆ మధ్య వాల్తేరు వీరయ్య సినిమాలో కాసేపు కామెడీ చేశాడు కానీ అందులో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంది. అలా కాకుండా ఒకప్పుడు తన నుంచి వచ్చిన ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్స్ ఎలాగైతే ఉన్నాయో.. అలాంటి సినిమా చేయాలని చూస్తున్నాడు మెగాస్టార్. ఒక గ్యాంగ్ లీడర్.. ఒక ఘరానా మొగుడు.. ఒక రౌడీ అల్లుడు ఇలాంటి మాస్ మసాలా సినిమా చేయాలని చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు చిరంజీవి. కానీ అలాంటి కథ ఏ దర్శకుడు తీసుకురావడం లేదు. అందుకే అనిల్ రావిపూడికి తనకు కావాల్సిన అంశాలన్నీ చెప్పి.. ఒక కథ సిద్ధం చేయించుకున్నాడు మెగాస్టార్. అదే మెగా 157..!
ఎండలు కాస్త తగ్గిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఒక్కసారి మొదలు పెడితే పూర్తయ్యే వరకు నో బ్రేక్స్ అంటున్నాడు అనిల్ రావిపూడి. చిరంజీవి కూడా దర్శకుడు చెప్పిన మాటకు ఒకే అన్నాడు. కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి.. సంక్రాంతి సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. జూన్ నుంచి మొదలుపెట్టి.. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లోపు షూటింగ్ పూర్తి చేసి.. మిగిలిన మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవాలి అనేది అనిల్ ప్లాన్. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఇలాగే పూర్తి చేశాడు ఈ దర్శకుడు. అది సూపర్ సక్సెస్ అయింది. ఎవరు ఊహించని విధంగా 300 కోట్లు వసూలు చేసింది. గత 20 ఏళ్లలో ఒక సినిమాకు ఇంత భారీ లాభాలు రావడం ఇదే మొదటిసారి. అందుకే చిరంజీవి కోసం సేమ్ ప్లాన్ అప్లై చేస్తున్నాడు. ఇది కూడా భార్యాభర్తల మధ్య నడిచే స్టోరీ అని తెలుస్తుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. బాలీవుడ్ నుంచి పరిణీతి చోప్రా, అదితి రావు హైదరి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఐశ్వర్య రాజేష్ పేరు కూడా బలంగా వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ విషయంలో అనిల్ చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ముఖ్యంగా చిరంజీవి ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని టైటిల్ ఫైనల్ చేయాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే మెగా 157 సినిమాకు చిరునవ్వుల పండగ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో నవ్వుల పండగ అనేది హైలైట్ అవుతుంది. ముందు చిరు అనేది స్పెసిఫిక్ గా హైలైట్ చేయనున్నాడు అనిల్. అంటే సంక్రాంతి పండుగకు చిరంజీవి నవ్వుల పండుగ తీసుకొస్తున్నాడు అనేది దీని మీనింగ్. టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని గ్యారెంటీ ఇస్తున్నాడు అనిల్. చిరంజీవి కూడా ఈ మధ్య రెండు మూడు ఈవెంట్స్ లో ఇదే చెప్పాడు. తన ఇంటికి వచ్చి అనిల్ రావిపూడి స్టోరీ చెప్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని.. మీకు కూడా సినిమా చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది అని చెప్పాడు మెగాస్టార్. అన్నట్టు ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తాడని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన సినిమా ఓపెనింగ్ కు కూడా వచ్చాడు. ఒక కీలక పాత్ర కోసం వెంకీని అప్రోచ్ అయితే.. ఆయన వెంటనే ఓకే అన్నాడని తెలుస్తుంది. అయినా అనిల్ రావిపూడి ఒకవైపు.. చిరంజీవి మరొకవైపు ఉన్నప్పుడు వెంకటేష్ నో ఎలా చెప్తాడు..?
అందుకే మెగా సినిమాలో 300 కోట్ల హీరో కూడా ఉండబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు అంతకంటే పెద్ద ట్రీట్ ఉండదు. ఏదేమైనా సంక్రాంతికి చిరునవ్వుల పండగ తీసుకురావడం ఖాయం అంటున్నాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా బడ్జెట్ కూడా చాలా తక్కువగానే ఉండబోతుంది. దీనికోసం చిరంజీవి, అనిల్ రెమ్యూనరేషన్ కాకుండా షేర్ ప్రాసెస్ లో వెళ్తున్నారని తెలుస్తుంది. అంటే బిజినెస్ లో షేర్ తీసుకుంటారన్నమాట. అలా చేస్తే నిర్మాతకు చాలా లాభం. మొత్తానికి చూడాలి.. ఈ కాంబినేషన్ లో రాబోయే చిరునవ్వుల పండగ ఎలా ఉండబోతుందో.