Allu arjun : లేట్ గా వస్తున్న పుష్ప.. ఏం చేస్తాడో మరి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో.. 'పుష్ప-2' తో అంతకుమించిన సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది.

The title song will be released as the first single of 'Pushpa-2'.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో.. ‘పుష్ప-2’ తో అంతకుమించిన సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది.
‘పుష్ప-2’ ఫస్ట్ సింగిల్ గా టైటిల్ సాంగ్ విడుదల కానుంది. “పుష్ప.. పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్” అంటూ సాగే ఈ సాంగ్ లిరికల్ ప్రోమోని ఇటీవల విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ని మే 1న ఉదయం 11:07 కి విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు రిలీజ్ టైం మారింది. మే 1న సాయంత్రం 5:04 కి రిలీజ్ చేయనున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు.
‘పుష్ప-1’ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’, ‘ఊ అంటావా మావా’, ‘శ్రీవల్లి’, ‘సామి సామి’, ‘దాక్కో దాక్కో’.. ఇలా అన్ని పాటలూ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. అందుకే ‘పుష్ప-2’ సాంగ్స్ పై ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. అయితే “పుష్ప.. పుష్ప..” ప్రోమోకి మిశ్రమ స్పందనే వచ్చింది. మరి ఫుల్ సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.