samyuktha menon : బెల్లంకొండతో సంయుక్త …. హీరోకి పండగ వచ్చినట్టే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ రానాల హిట్ మూవీ బీమ్లా నాయక్..దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ సంయుక్త మీనన్..రానాకీ జోడిగా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే రాబట్టింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార, ధనుష్ సార్, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష లో చేసి హిట్ హీరోయిన్ అనే పేరుని సంపాదించింది.

The union with Bellamkonda is like a festival for the hero.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ రానాల హిట్ మూవీ బీమ్లా నాయక్..దాని ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన భామ సంయుక్త మీనన్..రానాకీ జోడిగా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే రాబట్టింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార, ధనుష్ సార్, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష లో చేసి హిట్ హీరోయిన్ అనే పేరుని సంపాదించింది. తాజాగా ఈ భామ ఒక సినిమాకి ఒప్పుకుంటుందా లేదా అనే చర్చ సినీ సర్కిల్స్ లో జరుగుతుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఒక నూతన చిత్రం తెరకెక్కబోతుంది. మూన్ షైన్ పతాకంపై బెల్లంకొండ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకోనుంది. నూతన దర్శకుడు లుధిర్ బైరెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని ఒప్పించే పనిలో మేకర్స్ ఉన్నారు. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారు.ఆమె కూడా సానుకూలంగా స్పందించిందనే వార్తలు వస్తున్నాయి. అన్ని కుదిరితే వచ్చే నెలలో షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉంది
సంయుక్త చేతిలో ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక మూవీ స్వయంభూ తో పాటు శర్వానంద్ అప్ కమింగ్ మూవీ కూడా ఉంది. మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి. మరి బెల్లం కొండ మూవీకి ఓకే చెప్తుందో లేదో చూడాలి. ఆ ఇద్దరి కాంబో ఫిక్స్ అయితే మాత్రం సినీ ప్రియులకి పండగే