Chiranjeevi: పూనకాలు తెప్పిస్తోన్న చిరు 157 పోస్టర్‌.. అన్నయ్యకు ఈసారైనా హిట్ దక్కేనా ?

భోళాశంకర్‌ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ నెక్ట్స్ మూవీ ఏంటా అని చర్చ జరుగుతున్న వేళ.. ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 22, 2023 | 02:41 PMLast Updated on: Aug 22, 2023 | 2:41 PM

The Update Of This Movie Featuring Uv Creations Was Released As Chirus Birthday Special

భోళాశంకర్‌ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ నెక్ట్స్ మూవీ ఏంటా అని చర్చ జరుగుతున్న వేళ.. ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. బంగార్రాజు డైరెక్టర్‌ కల్యాణ్ కృష్ణకు ఓకే చెప్తారా.. బింబిసారా వశిష్టకు అవకాశం ఇస్తారా అని ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వేళ.. క్లారిటీ ఇచ్చారు చిరు. బింబిసార దర్శకుడు వశిష్టకే జెండా ఊపాడు. వశిష్టతో మూవీ ఉంటుందనే రూమర్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయ్. యూవీ క్రియేషన్స్‌తో వశిష్ట చేసే ఈ సినిమా అప్డేట్‌ను చిరు బర్త్ డే స్పెషల్‌గా రిలీజ్ చేశారు. పోస్టర్‌ లుక్‌ మాత్రం కేక పుట్టిస్తోంది. సినిమాకు సంబంధించి లీక్స్‌ అయితే.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయ్. ఇలాంటి పాత్రలో కదా చిరును చూడాలి అనుకుంటున్నాం అని ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. విశ్వానికి అవతల చిరును చూపిస్తారని తెలుస్తోంది. అంటే కొత్త ప్రపంచాన్ని, విశ్వాన్ని వశిష్ట క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ పంచభూతాలు కలిస్తేనే మెగాస్టార్ అన్నట్టుగా కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. పోస్టర్‌ అబ్జర్వ్‌ చేస్తే.. ఏదో కొత్త ప్రపంచాన్ని డైరెక్టర్ క్రియేట్‌ చేయబోతున్నట్లు అనిపిస్తోంది. బింబిసారలో కొత్త కాన్సెప్ట్‌తో మ్యాజిక్ చేశాడు. నాటి కాలాన్ని, నేటి కాలాన్ని మాయాదర్పణంతో కలిపాడు. మరి ఇప్పుడు ఏ కాన్సెప్ట్ ఎంచుకున్నాడో.. ఆ పంచభూతాలకు అధిపతి అయిన మహాదేవుడిలా చూపిస్తాడా.. ఆ పంచభూతాలను తన గుప్పిట్లో పెట్టుకునే సాధారణ మానవుడిలా చిరంజీవిని చూపిస్తాడా అని ఫ్యాన్స్‌ డిస్కషన్ మొదలుపెట్టారు.

వరుస రీమేక్‌లతో చిరు రాడ్‌ల మీద రాడ్‌లు దింపుతున్నారు. ఎందుకు అన్నయ్యా.. సరిగ్గా స్ట్రెయిట్ సినిమా చేసుకోకుండా అని ఫ్యాన్స్ కూడా దిగాలుగా చూస్తున్న సమయంలో.. వశిష్టతో మూవీ అంటే కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఎప్పుడూ రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నందుకు.. హ్యాపీగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. చిరు 157 మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి, కెమెరామెన్‌గా చోటా కే నాయుడు పనిచేయబోతున్నారని టాక్.