Tiger Nageswara Rao: థియేటర్ల పంపకాల లెక్కలు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయా..?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు థియేటర్ల పంపకాల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే భగవంత్ కేసరికి 900 థియేటర్లు కేటాయించారు. లియో మూవీ కోసం 500 థియేటర్లు కేటాయించారు.

Tiger Nageswara Rao: వచ్చే వారం పండగ సందడంతా థియేటర్స్‌లోనే కనిపించబోతోంది. లియో, భగవంత్ కేసరి ఒకేరోజు, అక్టోబర్ 19న థియేటర్స్‌లో సందడి చేయబోతున్నాయి. ఆ మరుసటి రోజు.. అంటే అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు థియేటర్స్ మీద దాడికి రెడీ అయ్యాడు. అయితే అసలు ఆట రిలీజ్ డే, ఆ మరుసటి రోజు మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు థియేటర్ల పంపకాల అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే భగవంత్ కేసరికి 900 థియేటర్లు కేటాయించారు. లియో మూవీ కోసం 500 థియేటర్లు కేటాయించారు. కాకపోతే ఇది అక్టోబర్ 19నాటి థియేటర్ల పంపకాల లెక్కలు. 20న ఈ లెక్కలు మారుతాయి. భగవంత్ కేసరి, లియో ఇందులో ఏది హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ సినిమాకు థియేటర్స్ అలానే ఉంచి, టాక్ వీకైన మూవీ థియేటర్లు తీసేసి అవి, టైగర్ నాగేశ్వరావుకి ఇస్తారు. అక్కడితో సినిమా అయిపోలేదు. టైగర్ నాగేశ్వరావు బాగా ఆడితే, భగవంత్ కేసరి, లియో మూవీల్లో ఏ సినిమా రవితేజ మూవీకి పోటీ ఇచ్చేలా ఉందో దాన్ని ఉంచి, మిగతా మూవీకి థియేటర్లు తగ్గిస్తారు.
ఇలా ప్రతీ రోజు థియేటర్ల సంఖ్య పెరగటం తగ్గటం జరగబోతోంది. ఇలాంటి సందర్భాలు అరుదుగా వస్తాయి. సంక్రాంతికే ఇలాంటి సీన్లు చూడటం కామన్. కాని దసరాకు ఇలాంటి పరిస్థితి రావటం ఇదే మొదలు అంటున్నారు సినీ జనాలు.