అప్పుడు బాలకృష్ణ.. ఇప్పుడు చిరంజీవి.. కర్మ ఎవరిని వదిలిపెట్టదు..!

సోషల్ మీడియా అంతగా లేని రోజుల్లోనే ట్రోలింగ్ అనే మాట వినిపిస్తే చాలు.. వెంటనే మనకు గుర్తుకొచ్చే హీరో బాలకృష్ణ. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాల్లోని సన్నివేశాలు అన్నీ తీసుకొని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ చేస్తుంటారు ట్రోలింగ్ బ్యాచ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 26, 2025 | 11:25 AMLast Updated on: Feb 26, 2025 | 11:25 AM

Then Balakrishna Now Chiranjeevi Karma Never Leaves Anyone

సోషల్ మీడియా అంతగా లేని రోజుల్లోనే ట్రోలింగ్ అనే మాట వినిపిస్తే చాలు.. వెంటనే మనకు గుర్తుకొచ్చే హీరో బాలకృష్ణ. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాల్లోని సన్నివేశాలు అన్నీ తీసుకొని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ చేస్తుంటారు ట్రోలింగ్ బ్యాచ్. ఒకటి రెండు కాదు కొన్ని సంవత్సరాల పాటు బాలయ్య యాక్షన్ సీన్స్ కానీ.. ఆయన చేసిన ఎమోషనల్ సీన్స్ కానీ భయంకరంగా ట్రోల్ చేశారు. మరీ ముఖ్యంగా విజయేంద్ర వర్మ సినిమాలో కుందేలు కోసం కొండ ఎక్కే సీన్.. నరసింహ నాయుడులో క్లాసికల్ డాన్స్.. పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్లే సీన్.. ఇలా ఒకటి రెండు కాదు బాలయ్య చేసిన ఎన్నో సన్నివేశాలను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే ఏ రోజు కూడా బాలకృష్ణ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు టైం మొత్తం టర్న్ అయిపోయింది. కరోనా తర్వాత బాలయ్య సినిమాలు నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాయి.

అఖండ నుంచి మొదలుపెడితే నిన్న మొన్నటి డాకు మహారాజ్ వరకు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి ఆయన సినిమాలు. అంతెందుకు ఈ సినిమాలను ట్రోల్ చేసిన వాళ్ళు.. ఇప్పుడు జై బాలయ్య అంటున్నారు. మరి ట్రోల్ చేయడానికి ఎవరో ఒకరు దొరకాలి కదా.. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి చిరంజీవి వచ్చాడు. ఒకప్పుడు మెగాస్టార్ ను ట్రోల్ చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించిన వాళ్లే.. ఇప్పుడు ఈజీగా ఆయనను మీమ్స్ కోసం వాడుకుంటున్నారు. చిరు చేసిన పాత సినిమాల్లోని ఎక్స్ప్రెషన్స్ తీసుకొని టెంప్లేట్స్ కింద వాడుకుంటున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు చిరంజీవి గురించి దారుణంగా ట్రోలింగ్ జరుగుతుందిప్పుడు.

ఒకప్పుడు బాలయ్యను ఏ రేంజ్ లో వాడుకున్నారో.. దానికి 10 రేట్లు ఎక్కువ చిరంజీవిని టార్గెట్ చేస్తున్నారు. బాలయ్యపై ట్రోలింగ్ జరిగిన రోజుల్లో సోషల్ మీడియా అంత యాక్టివ్ గా లేదు.. కానీ ఇప్పుడు పీక్స్ లో ఉంది. అందుకే చిరంజీవి దొరికిపోతున్నాడు. ఏదేమైనా ఈ ఇద్దరు లెజెండరీ యాక్టర్స్. తెలుగు ఇండస్ట్రీని పది మెట్లు పైకి ఎక్కించిన అద్భుతమైన నటులు. అలాంటి వాళ్ళను ట్రోలింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. చిన్న చిన్న టెంప్లేట్స్ తీసుకుని సరదా మీమ్స్ ఓకే గాని.. ఇమేజ్ దెబ్బ తీసే ట్రోలింగ్ మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని అభిమానులే కాదు ఎవరూ ప్రోత్సహించకూడదు.