అప్పట్లో ఉదయ్ కిరణ్.. తర్వాత అల్లు అర్జున్.. ఇప్పుడు ఎన్టీఆర్ బామ్మర్ది..!

ఈ రోజుల్లో ఒక హీరో ఒక హిట్టు కొట్టడమే గగనంగా మారుతుంది. అలాంటిది వరుసగా మూడు హిట్లు అంటే చిన్న విషయం కాదు. అదృష్టం బాగా ఉంటే కానీ ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మంచి సినిమాలు వచ్చినా కూడా వాటికి కలెక్షన్స్ రావు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 29, 2025 | 04:52 PMLast Updated on: Mar 29, 2025 | 4:52 PM

Then It Was Uday Kiran Then Allu Arjun Now Its Ntr The Old Man

ఈ రోజుల్లో ఒక హీరో ఒక హిట్టు కొట్టడమే గగనంగా మారుతుంది. అలాంటిది వరుసగా మూడు హిట్లు అంటే చిన్న విషయం కాదు. అదృష్టం బాగా ఉంటే కానీ ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మంచి సినిమాలు వచ్చినా కూడా వాటికి కలెక్షన్స్ రావు. అలాంటిది మొదటి మూడు సినిమాలతో విజయాలు అందుకోవడం అంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు అసాధ్యం. అది కూడా చేసి చూపించాడు అంటే ఆ హీరో నిజంగా సుడిగాడే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఇదే చేశాడు. చాలా సైలెంట్ గా ఇండస్ట్రీకి వచ్చి వరుసగా మూడు విజయాలు అందుకున్నాడు నితిన్. నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. చాప కింద నీరు అంటారు కదా అలా ఇండస్ట్రీకి వచ్చిన నితిన్.. రెండేళ్లలో మూడు విజయాలు అందుకున్నాడు. శ్రీశ్రీశ్రీ రాజావారు అనే సినిమాతో పరిచయం కావాల్సిన నార్నే నితిన్.. అనుకోకుండా మ్యాడ్ సినిమాతో పరిచయమయ్యాడు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023లో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. అందులో అశోక్ పాత్రలో బాగా సెట్ అయ్యాడు నితిన్.

తొలి సినిమా కదా చాలామంది హీరోలు అలా తెలియకుండా క్లిక్ అవుతుంటారులే అనుకున్నారంతా. కానీ రెండో సినిమా గీతా ఆర్ట్స్ 2లో ఆయ్ అంటూ వచ్చాడు ఈ హీరో. గతేడాది దసరా సమయంలో విడుదలైన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలు తీసుకొచ్చింది. చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చిన ఆయ్ చేసిన బిజినెస్ కంటే డబ్బులు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక తాజాగా మ్యాడ్ స్క్వేర్ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డేనే ఈ సినిమాకు కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ రేంజ్ లో ఇది లేదు అంటున్నారు కానీ బాగాలేదు అని మాత్రం అనట్లేదు ఆడియన్స్. చూస్తుంటే కచ్చితంగా ఈ వీకెండ్ అయ్యేలోపే మ్యాడ్ స్క్వేర్ కూడా సేఫ్ జోన్ లోకి వచ్చేలా కనిపిస్తోంది. దాంతో వరుసగా మూడో విజయం పూర్తి చేశాడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది. మొదటి మూడు సినిమాలతో హిట్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇండస్ట్రీలో చాలా తక్కువ హీరోలకు మాత్రమే అది సాధ్యమైంది.

గత 25 ఏళ్లలో ఫస్ట్ మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన హీరోలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. మిలీనియం మొదట్లో చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్.. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్.. ఆర్య, బన్నీ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్నాడు. మళ్లీ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్.. కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మామ సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఈ ముగ్గురు హీరోల తర్వాత ఇప్పుడు నార్నే నితిన్ తొలి మూడు సినిమాలతో విజయాలు అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు. ఎన్టీఆర్ బావమరిదిగానే ఇండస్ట్రీకి వచ్చినా కూడా.. బావ పేరుని మాత్రం ఎక్కడా పెద్దగా యూస్ చేయలేదు ఈయన. ఇంకా మీడియానే నితిన్ ను ఎన్టీఆర్ గురించి పదేపదే అడుగుతుంది. ఆయన కూడా ఓపిగ్గా బావగారి గురించి చెప్తూ ఉంటాడు. ఏదేమైనా కూడా దాదాపు పదేళ్ల తర్వాత నితిన్ నార్నే హ్యాట్రిక్ అందుకున్నాడు.