MEGASTAR CHIRANJEEVI : అప్పుడు చిరు, ఇప్పుడు మహేష్.
ఈ మధ్య సినిమాలపై సోషల్ మీడియా ప్రభావం బాగా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ ని సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ట్రెండింగ్ లో ఉన్న బూతు డైలాగులను కూడా వదలడం లేదు. మెగాస్టార్, సూపర్ స్టార్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాలలో సైతం ఈ బూతు డైలాగులను ఉపయోగిస్తుండటం సంచలనంగా మారింది.

Then Mogastar Chiram Jeevi is now like Superstar Mahesh Babu and KCPD word is hal chal
ఈ మధ్య సినిమాలపై సోషల్ మీడియా ప్రభావం బాగా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్ ని సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు ట్రెండింగ్ లో ఉన్న బూతు డైలాగులను కూడా వదలడం లేదు. మెగాస్టార్, సూపర్ స్టార్ అనే తేడా లేకుండా స్టార్ హీరోల సినిమాలలో సైతం ఈ బూతు డైలాగులను ఉపయోగిస్తుండటం సంచలనంగా మారింది.
ఆ మధ్య ‘కేసీపీడీ’ అనే పదం సోషల్ మీడియాని ఒక ఊపు ఊపింది. ఇదొక బూతు పదం. ఒక పిల్లాడు అన్న బూతు మాటని ‘కేసీపీడీ’ అని షార్ట్ ఫామ్ చేశారు. ఇది అప్పుడు తెగ వైరల్ అయింది. చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సైతం ‘కేసీపీడీ’ అనే పదాన్ని ఉపయోగించారు. దానికి ‘కొణిదెల చిరంజీవి ప్యూర్ డామినేషన్’ అని ఏదో కొత్త అర్థం ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. అది బూతు పదమని నెటిజన్లకు అవగాహన ఉంది.
ఇక ఇటీవల “ఆ కుర్చీని మడతపెట్టి ..” అనే బూతు డైలాగ్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. అయితే ఇప్పుడు ఈ డైలాగ్ తో మహేష్ బాబు సినిమాలో పాట వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా ‘గుంటూరు కారం’ నుంచి “కుర్చీ మడతపెట్టి” అనే మాస్ సాంగ్ ప్రోమో విడుదలైంది. “ఆ కుర్చీని మడతపెట్టి ..” అంటూ బీప్ సౌండ్ తో ఆ సాంగ్ ప్రోమో సాగింది. మహేష్ బాబు సినిమాలో ఇలా ఒక బూతు డైలాగ్ తో పాట చేయడం షాకింగ్ గా మారింది.చిరంజీవి, మహేష్ బాబు వంటి బిగ్ స్టార్స్.. ఇలా సోషల్ మీడియా బూతు డైలాగులను తమ సినిమాల్లో ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చలు జరుగుతున్నాయి.