అప్పుడు NTR.. ఇప్పుడు NBK..! అబ్బాయిని ఫాలో అవుతున్న బాబాయ్..!

సింహా సినిమాలో బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్పాడు గుర్తుందా..? చరిత్ర అంటే మాది.. చరిత్ర సృష్టించాలన్న మేమే.. దాన్ని తిరగరాయాలన్న మేమే..! ఈ డైలాగ్ అంత ఈజీగా ఎవరు మర్చిపోరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 29, 2025 | 08:19 PMLast Updated on: Mar 29, 2025 | 8:19 PM

Then Ntr Now Nbk Babai Following The Boy

సింహా సినిమాలో బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్పాడు గుర్తుందా..? చరిత్ర అంటే మాది.. చరిత్ర సృష్టించాలన్న మేమే.. దాన్ని తిరగరాయాలన్న మేమే..! ఈ డైలాగ్ అంత ఈజీగా ఎవరు మర్చిపోరు. ఎందుకంటే బాలయ్య చెప్పిన విధానం అలా ఉంది మరి. తాజాగా ఇండస్ట్రీలో కొత్త ట్రెండుకు తెర తీస్తున్నారు బాబాయి అబ్బాయి. ఆల్రెడీ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఈ ట్రెండ్ కు రిబ్బన్ కట్ చేస్తే.. బాలయ్య దాన్ని ఫాలో అవుతున్నాడు. ఇంతకీ ఏ విషయంలో అబ్బాయిని బాబాయి ఫాలో అవుతున్నాడు అనే కదా మీ అనుమానం..! అక్కడికే వస్తున్నాం..! అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాల కంటే పాత సినిమాలన్నీ ఎక్కువగా చూస్తున్నారు ప్రేక్షకులు. వాళ్ల అభిమానం క్యాష్ చేసుకోవడానికి వరసగా పాత సినిమాలు మళ్లీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 4న ఇండియాస్ ఫస్ట్ టైం ట్రావెల్ మూవీ ఆదిత్య 369 మళ్లీ విడుదల కానుంది. 1991లో సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాన్ని 4K లోకి మేకోవర్ చేసి ఏప్రిల్ 4న మరోసారి విడుదల చేస్తున్నారు. ఇందులో కొత్తేముంది.. పాత సినిమాలను విడుదల చేయడం మనకు అలవాటే కదా అనుకోవచ్చు. కానీ రీ రిలీజ్ సినిమాలకు ప్రీ రిలీజ్ వేడుక చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి..! విచిత్రంగా ఉంది కదా.. చేసేదే రీ రిలీజ్.. మళ్లీ దానికి రిలీజ్ అవుతుంది అని చెప్పడానికి మరొక ఫంక్షన్ ఎందుకు అనే కదా మీ అనుమానం..! అందుకే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ట్రెండ్ క్రియేట్ చేశాడు అనేది. ఆ మధ్య సింహాద్రి సినిమా రీ రిలీజ్ చేశారు గుర్తుంది కదా..!

చరిత్రలో ఫస్ట్ టైం దానికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు ఎన్టీఆర్ అభిమానులు. దానికి విశ్వక్ సేన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఆ తర్వాత ఆది సినిమాకు కూడా ఒక చిన్న వేడుక చేశారు. ఇప్పుడు బాలకృష్ణ ఆదిత్య 369 సినిమాకు రీ రిలీజ్ ఈవెంట్ మార్చి 30న ఉగాది సందర్భంగా భారీ ఎత్తున చేయబోతున్నారు. దీనికి బాలకృష్ణ సహా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ హాజరవుతున్నారు. 34 సంవత్సరాల కింద ఈ సినిమా కోసం తాము పడ్డ కష్టం అభిమానులతో పంచుకోవాలని ఈ వేడుక పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. రీ రిలీజ్ సినిమాకు ఈ స్థాయిలో ఫంక్షన్ ప్లాన్ చేస్తుండడం ఇండియాలో ఇదే మొదటిసారి. అప్పుడు సింహాద్రి వేడుక కూడా బాగానే చేశారు.. ఇప్పుడు బాబాయ్ బాలయ్య సినిమా వేడుక దానికి మించి జరగబోతుంది. మ్యాటర్ ఏదైనా అబ్బాయిని ఇలా ఫాలో అయిపోతున్నాడు బాబాయ్. మరి మూడు దశాబ్దాల తర్వాత మరోసారి విడుదలవుతున్న ఆదిత్య 369.. ఈ జనరేషన్ ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.