Krish : అప్పుడు కంగనా, ఇప్పుడు పవన్‌తో…
స్టార్ డైరెక్టర్ క్రిష్ (Star Director Krish) కెరీర్ స్టార్టింగ్‌లో అదిరిపోయే సినిమాలు చేశాడు. కానీ రెండు సినిమాల విషయంలో మాత్రం క్రిష్ (Krish) గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మరి క్రిష్‌కే ఎందుకిలా జరుగుతోంది నెక్స్ట్ క్రిష్ ఏం చేయబోతున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది.

Then with Kangana, now with Pawan...
స్టార్ డైరెక్టర్ క్రిష్ (Star Director Krish) కెరీర్ స్టార్టింగ్‌లో అదిరిపోయే సినిమాలు చేశాడు. కానీ రెండు సినిమాల విషయంలో మాత్రం క్రిష్ (Krish) గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మరి క్రిష్‌కే ఎందుకిలా జరుగుతోంది నెక్స్ట్ క్రిష్ ఏం చేయబోతున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది.
గమ్యం, వేదం, కంచె లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు క్రిష్.. అయితే.. చివరగా చేసిన కొండపొలం సినిమాతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. ఇక దీని తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) తో హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమాను చాలా గ్రాండ్‌గా మొదలు పెట్టాడు. దాదాపు మూడున్నరేళ్ల క్రితం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. అయితే.. ఈ సినిమా తర్వాత మొదలైన ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ (Bro) సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh) కొంత వరకు జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకున్నాయి. కానీ ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా.. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించారు. క్రిష్ ప్లేస్‌లో ఏఎం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.
పవన్‌ను జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేస్తాడా లేదా అనేది పక్కన పెడితే.. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నాడనేది హాట్ టాపిక్‌గా మారింది. గతంలో.. కంగనా రనౌత్ ‘మణికర్ణిక’ విషయంలో కూడా ఇదే జరిగింది. కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో క్రిష్ ఆ సినిమా మొదలు పెట్టారు. కానీ చివర్లో కంగనా, క్రిష్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో.. ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పుడు కూడా హరిహర వీరమల్లు మరో 30 శాతం షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా తప్పుకున్నాడు. ఇప్పుడు కూడా పవన్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే క్రిష్ తప్పుకున్నాడని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతం క్రిష్, అనుష్కతో ఓ సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా అయిన కంప్లీట్ అవుతుందో లేదో చూడాలి.