Rajkundra Shilpa Shetty : భర్తకు శిల్పాశెట్టి విడాకులు.. అసలు ట్విస్ట్ ఇదేనా.. ?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు చాలా కామన్. ఎంత త్వరగా ప్రేమలో పడతారో.. అంతే త్వరగా పెళ్లి చేసుకోవడం.. అంతకుమించి త్వరగా విడాకులు తీసుకొని వార్తల్లో నిలుస్తుంటారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో పలువురు సినీ తారలు ఇలా విడాకులు తీసుకోగా.. ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి.. తన భర్త రాజ్ కుంద్రాతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

There are reports that Bollywood hero Rajkundra is divorcing his wife Shilpa Shetty
ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు చాలా కామన్. ఎంత త్వరగా ప్రేమలో పడతారో.. అంతే త్వరగా పెళ్లి చేసుకోవడం.. అంతకుమించి త్వరగా విడాకులు తీసుకొని వార్తల్లో నిలుస్తుంటారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లో పలువురు సినీ తారలు ఇలా విడాకులు తీసుకోగా.. ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి.. తన భర్త రాజ్ కుంద్రాతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాజ్ కుంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ట్విట్టర్ లో శిల్పా గురించి ప్రస్తావించకుండా.. మేము విడిపోయాము. ఈ కష్టకాలంలో మాకు సమయం ఇవ్వాలని దయచేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం అంటూ.. శిల్పా పేరు ప్రస్తావించకుండా రాజ్‌కుంద్రా ట్వీట్ చేశాడు. ఇది కాస్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అుతోంది. వీరిద్దరు నిజంగానే విడిపోయారా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది భార్యభర్తల విడాకులు కాదని.. అంతకుమించి అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. నిజానికి రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఐతే రాజ్ విడిపోతుంది తన భార్యతో కాదు మాస్క్‌తో అని కొందరు అంటున్నారు.
2021లో నీలిచిత్రాల కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రా కొంత కాలం జైలు జీవితం గడిపాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపేందుకు ఇష్టపడలేదు. ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక మాస్క్‌తోనే కనిపించేవాడు. ఐతే ఈ మధ్యే అతడు తన జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. యూటీ 69 అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ మూవీలో రాజ్‌కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. చాలాకాలంగా మాస్క్ చాటున ముఖం దాచుకుంటున్న రాజ్.. యూటీ 69 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్క్ తీసేసి మీడియా ముందు నిలబడ్డాడు. బహుశా మాస్క్‌తో ఇక సంబంధం లేదని ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది. రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వియాన్, సమీషా అని ఇద్దరు సంతానం.