Raja Mouli: ఆర్ ఆర్ ఆర్ మూవీ కి సీక్వెల్ రెడీ అవుతోందా? రాజమౌళి ఈ సినిమాకి డైరెక్షన్ చెయ్యట్లేదా?
ఆర్ ఆర్ ఆర్ తెలుగోడి పవర్ ని ఆస్కార్ వేదిక మీద చాటి చెప్పిన పాన్ ఇండియా మూవీ. 550 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కి 1316 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన రాజమౌళి చిత్రం. ఎన్టీఆర్ . రామ్ చరణ్ హీరో లుగా టాలీవుడ్ జక్కన్న తెరకెక్కించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ త్రిపుల్ ఆర్. కొమరం భీం గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు గా రాంచరణ్ దుమ్మురేపిన ఈ సినిమా. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ లా నిలిచిపోయింది. రాజమౌళి మార్క్ అఫ్ మేకింగ్ అండ్ టేకింగ్ కి ప్రపంచమంతా ఫిదా అయింది.

There are reports that Chandrasekhar has been selected as the director for the sequel of RRR movie
ఇక ఈ సినిమాకి వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చి తెలుగు సినిమా ఖ్యాతి ని ఆస్కార్ అంచులకి తీసుకెళ్లారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. అయన నాటు నాటు పాట ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, అమెరికా వేదికగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ సొంతం చేసుకుంది. సెంటిమెంట్, యాక్షన్, దేశభక్తి, ప్రేమ, స్నేహం.. ఇలా ఒక్కటేంటి ఎన్నో రకాల ఎమోషన్స్ ని రంగరించి ఆర్ ఆర్ ఆర్ ని బెస్ట్ మూవీ గా చేసారు రాజమౌళి. కలెక్షన్స్ పరంగానే కాకుండా అవార్డుల్లోనూ ఈ సినిమా సెట్ చేసిన రికార్డ్స్ వేరే ఫిలిం మేకర్స్ కలలో కూడా రీచ్ కాలేని స్థాయిలో ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ ఒక సంచలనం – ఒక చరిత్ర ఇది సీక్వెల్ ట్రెండ్ బాగా నడుస్తోన్న టైం కదా మరి ఆర్ ఆర్ ఆర్ కి సీక్వెల్ ఉంటుందా ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు.
రాజమౌళి తండ్రి, ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్తున్నారు. మరి ఈ సీక్వెల్ కి రాజమౌళి డైరెక్టర్ గా ఉంటారా లేదా అన్నది మిలియన్ డాలర్ ల ప్రశ్నగా మారిపోయింది. రాజమౌళి మహేష్ బాబు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ లో లాక్ అయివున్నారు. సో ఈ సీక్వెల్ కి డైరెక్టర్ రాజమౌళి కాదు.. మరి ఎవరు ? ఆ డైరెక్టర్ ఎవరు అని ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. రీసెంట్ గా వాటికీ ఫుల్ స్టాప్ పడింది. అయితే, అనుకోకుండా ఒక రోజు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసి ఒక స్పెషల్ డైరెక్టర్ గా ముద్రపడ్డ చంద్రశేఖర్ ఏలేటి ఈ సీక్వెల్ కి డైరెక్షన్ చేస్తారని తెలుస్తోంది . దీనికి దర్శకత్వ పర్యవేక్షణ రాజమౌళి చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో.