Chiranjevi: మెగాస్టార్ కి పాచిపోయిన సినిమానా..? ఫ్యాన్స్ ఊరుకుంటారా..?
మెగాస్టార్ చిరంజీవితో బింబి సార ఫేం వషిష్ట తీసే సినమా రెండు పాత హిట్ల కాంబినేషన్ అంటూ ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంద.ి చిరు హిట్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎన్టీఆర్ జగదేకవీరుడి కథని మిక్స్ చేసి ముళ్లోక వీరుడిని వషిష్ట ప్లాన్ చేశాడన్నారు.

There are reports that directors Vashishta and Kalyan Krishna have convinced Chiranjeevi to do the film with a new look on old stories
సరే బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ తో చిరు చేసేదైనా ఫ్రెష్ కథా అంటే, అది మెగాస్టార్ హిట్ మూవీ అందరివాడు, మలయాళం హిట్ మూవీ బ్రోడాడీ కథల సమాహరాం అని ప్రచారం జరుగుతోంది. ఎందుకనో చిరు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి కొత్త కథలకంటే పాత కాపీ కథలు, లేదంటే రీమేకులే గతవుతున్నాయి.
సైరా నరసింహా రెడ్డి, ఆచార్యని వదిలేస్తే ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, ఇప్పుడు రాబోతున్న భోళాశంకర్ ఇవన్నీ రీమేకులే. సరే వాల్తేర్ వీరయ్య కొత్త కథేనా అంటే అది, చిరు హిట్ మూవీ ముటా మేస్రీ కి, తమిళ ఘర్షణ ప్లేవర్ ని యాడ్ చేశారనే కామెంట్లున్నాయి. ఆమధ్య త్రివిక్రమ్ శిష్యుడు వెంకీ కుడుముల కూడా జై చిరంజీవ స్టోరీలైన్ ని సరికొత్తగా వినిపించబోతే, పాత కథలకు గుడ్ బై అన్నాడట చిరు. కాని ఈ విషయంలో వశిష్ట, అలానే కళ్యాణ్ కృష్ణ చిరుని పాత కథలతో సక్సెస్ ఫుల్ గా చీట్ చేస్తున్నారనే ప్రచారం పెరిగింది. నెగెటీవ్ గుసగుసల జోరు ఎక్కువైంది.