Big Boss: బిగ్‌బాస్ 7లోకి ఐపీఎల్ ప్లేయర్!
బిగ్‌బాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి షో అవసరమా అంటూనే.. అందరూ చూసేస్తుంటారు అదేంటో ! వివాదాలు, విమర్శలు తక్కువేం కాదు. చిన్నపాటి డిబేట్లు కూడా నడిచిన రోజులు ఉన్నాయ్. ఐతే ఇప్పుడు బిగ్‌బాస్ 7 స్టార్ట్ కాబోతోంది. దీనికి సంబంధించి ఆ చానెల్ టీజర్ కూడా రిలీజ్ చేసింది. దీంతో ఈసారి బిగ్‌బాస్ 7లో కనిపించబోయే సెలబ్రిటీలు ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

There are reports that former cricketer Venugopal Rao will be a contestant in Bigg Boss season 7
బ్యాంకాక్ పిల్ల, ఎస్తర్, పండు.. ఇలా కొందరి పేర్లు వినిపిస్తున్నాయ్.. ఇప్పటికీ క్లారిటీ మాత్రం రాలేదు. ఇదంతా ప్రచారం మాత్రమే. ఐతే ఇప్పుడు బిగ్‌బాస్ 7కు సంబంధించి కీలక విషయం ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. ఆగస్ట్ లాస్ట్ వీక్‌లో బిగ్‌బాస్ 7 స్టార్ట్ కాబోతోంది. ఈసారి అంతకుమించి సర్‌ప్రైజ్‌లు ఉంటాయని నిర్వాహకులు అంటున్నారు. దీంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయ్. హోస్ట్‌గా ఈసారి కూడా నాగార్జుననే కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక అటు బిగ్‌బాస్‌లోకి ఇండియన్ క్రికెటర్ ఎంట్రీ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఏపీకి చెందిన వేణుగోపాలరావు.. మెగా షోలోకి తీసుకురావాలని ఆ చానెల్ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఇదే జరిగితే బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన తొలి క్రికెటర్‌గా వేణుగోపాల రావు రికార్డు క్రియేట్ చేయడం ఖాయం. బిగ్‌బాస్ 6లో సరైన కంటెంస్టెంట్‌లను ఎంపిక చేయకపోవడంతో.. ఆ సీజన్ అంతగా మెప్పించలేదు. అందుకే ఈసారి ఆ తప్పులు జరగకుండా చాలావరకు గుర్తింపు ఉన్న వారినే బిగ్‌బాస్ కోసం తీసుకురావలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వేణుగోపాలరావు.. భారత్ తరఫున ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా.. ఐపీఎల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు వేణుగోపాలరావు. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి.. ఇప్పుడు కామెంటేటర్‌గా చేస్తున్నాడు. స్టార్ స్పోర్ట్స్ తెలుగులో అప్పుడప్పుడు చక్కున మెరుస్తున్నాడు కూడా. నిజంగా వేణుగోపాలరావు.. బిగ్‌బాస్‌లోకి వస్తే అభిమానులకు అసలైన ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయం.