అరవోళ్ళకు రెబల్ స్టారే దిక్కయ్యాడా…? ఖైదీ 2 కోసం వెంట పడుతున్నారు…!

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సీరియస్ గా... తీసుకున్న ప్రాజెక్ట్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. ఇండియన్ సినిమాలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు మంచి స్వింగ్ లో ఉంది. త్వరలోనే సినిమాటిక్ యూనివర్స్ లో మరో ప్రాజెక్టు కూడా లాంచ్ చేయడానికి డైరెక్టర్ రెడీ అయిపోతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 1, 2025 | 01:21 PMLast Updated on: Feb 01, 2025 | 1:21 PM

There Are Reports That Lokesh Kanakaraj Who Has Also Planned A Film With Prabhas

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సీరియస్ గా… తీసుకున్న ప్రాజెక్ట్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. ఇండియన్ సినిమాలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమాటిక్ యూనివర్స్ ఇప్పుడు మంచి స్వింగ్ లో ఉంది. త్వరలోనే సినిమాటిక్ యూనివర్స్ లో మరో ప్రాజెక్టు కూడా లాంచ్ చేయడానికి డైరెక్టర్ రెడీ అయిపోతున్నాడు. కార్తీ నటించిన ఖైదీ సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ కు శ్రీకారం చుట్టిన డైరెక్టర్ లోకేష్… ఇప్పుడు రజినీకాంత్ తో కూలి అనే సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన వెంటనే ఖైదీ సీక్వెల్ రానున్నట్లు టాక్.

ఈ సినిమాలో కార్తీక్ పదేళ్ళు జైల్లో ఉండి రిలీజ్ అయినట్లు చూపించారు. కానీ అసలు ఎందుకు జైలుకు వెళ్లాడు అలాగే తన భార్య ఎందుకు చనిపోయింది.. అలాగే ఈ సినిమాలో విలన్ ఆది శంకరానికి హీరోకు మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది.. అనేవి ఈ సినిమాలో చూపించడానికి డైరెక్టర్ రెడీ అయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. రజినీకాంత్ కూలీ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్టును పట్టాలు ఎక్కించడానికి లోకేష్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత ఈ సినిమాటిక్ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు ఉండే అవకాశం ఉంది.

మొత్తం ఆరు సినిమాలు సినిమాటిక్ యూనివర్స్ లో తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు సినిమాలు కంప్లీట్ అయ్యాయి. దీని తర్వాత రోలెక్స్ అనే సినిమాను సూర్యతో ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. ఆ తర్వాత విక్రమ్ సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉంది. విక్రమ్ సీక్వెల్ తర్వాత హీరోలు అందరితో కలిపి ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. దీనికి కూడా స్క్రిప్ట్ వరకు రెడీ చేసుకున్నట్లు టాక్. అయితే ఇప్పుడు ఖైదీ సినిమాతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కు క్రేజ్ పెంచాలని రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ తో కూడా సినిమా ప్లాన్ చేసిన లోకేష్ కనకరాజ్ ఖైదీ సీక్వెల్లో ప్రభాస్ సీన్స్ కొన్ని చూపించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రభాస్ ఉంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమాటిక్ యూనివర్స్ పై క్రేజ్ క్రియేట్ అవుతుందని.. ఆ తర్వాత రోలెక్స్ అనే సినిమాలో కూడా ప్రభాస్ ను కొంత చూపించి ఆ తర్వాత ప్రభాస్ సినిమాను స్టార్ట్ చేయాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఇటు తెలుగులో కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పై జనాల్లో ఇంట్రెస్ట్ ఉండటంతో ఈ ప్రాజెక్టును చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. మరి ఖైదీ సీక్వెల్ను ఏ రేంజ్ లో ప్లాన్ చేశాడో తెలియాలంటే మరో ఏడాది ఆగాల్సిందే.