సంధ్య హిస్టరీ లో ఎన్నో హిట్స్..! ఆ ధియేటర్.. హీరోస్ కి అందుకే అంత సెంటిమెంటా?
సంధ్య 70mm ధియేటర్” రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేల ధియేటర్లు ఉన్నా... ఈ థియేటర్ కు ఉన్న రేంజ్ వేరు ఇప్పుడంటే అల్లు అర్జున్ పుణ్యమా అని ఈ థియేటర్ కు బాడ్ నేమ్ వచ్చింది కానీ ఒకప్పుడు ఈ థియేటర్లో సినిమా రిలీజ్ కావాలని స్టార్ హీరోలో ఎందరో పోటీపడేవారు.
సంధ్య 70mm ధియేటర్” రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వేల ధియేటర్లు ఉన్నా… ఈ థియేటర్ కు ఉన్న రేంజ్ వేరు ఇప్పుడంటే అల్లు అర్జున్ పుణ్యమా అని ఈ థియేటర్ కు బాడ్ నేమ్ వచ్చింది కానీ ఒకప్పుడు ఈ థియేటర్లో సినిమా రిలీజ్ కావాలని స్టార్ హీరోలో ఎందరో పోటీపడేవారు. సంధ్య థియేటర్ చరిత్ర ఈనాటిది కాదు. దశాబ్దాలుగా తెలుగు సినిమాను గుండెల్లో పెట్టుకొని మోస్తుంది సంధ్యా థియేటర్. ఎందరో స్టార్ హీరోల సినిమాలకు సంధ్య థియేటర్ ఒక సెంటిమెంట్. వేల ధియేటర్లు, వేల స్క్రీన్లు ఉన్నా సరే సంధ్య థియేటర్లో బొమ్మ పడితేనే ఏ స్టార్ హీరో అయినా సరే సాటిస్ఫై అవుతాడు.
అది సూపర్ స్టార్ అయినా రెబల్ స్టార్ అయినా యంగ్ టైగర్ అయినా నటసింహమైన, మెగాస్టార్ అయినా… ఒక సినిమా సూపర్ హిట్ లేదంటే అట్టర్ ఫ్లాప్ అనే టాక్ ఫస్ట్ వినపడేది సంధ్యా థియేటర్ కాంపౌండ్ లోనే. ఏ సినిమా రిలీజ్ అయినా… బెనిఫిట్ షో పడినా ప్రీమియర్ షో పడిన ఫస్ట్ షో పడేది సంధ్య థియేటర్లోనే. ఆ రేంజ్ లో తెలుగు సినిమాకు సంధ్య థియేటర్ ఒక పాపులర్ డెస్టినేషన్ అయిపోయింది. అసలు అలాంటి సంధ్యా థియేటర్ చరిత్ర ఎప్పటిది…? ఈ థియేటర్ ను ఎప్పుడు నిర్మించారు…? ఈ థియేటర్లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమాలు ఏంటి? ఒక్కసారి చరిత్ర చూద్దాం.
1979లో 70mm ధియేటర్ల ప్రస్థానం అప్పుడే మొదలైంది. అదే టైంలో హైదరాబాదులోని పాపులర్ సెంటర్… ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ ను నిర్మించారు. జనవరి 18, 1979లో ఈ థియేటర్ను ప్రారంభించారు. ఈ థియేటర్లో ముందుగా హిందీ సినిమా షాలిమార్ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన షోలే సినిమా ఇక్కడ రిలీజ్ అయింది. ఇక అక్కడ నుంచి ఈ ధియేటర్ ప్రస్తానం ఓ రేంజ్ లో సాగింది. చాలామంది స్టార్ హీరోలు సంధ్య థియేటర్లో సినిమా కచ్చితంగా రిలీజ్ అవ్వాలని పట్టుబడుతూ ఉంటారు.
మాస్ క్లాస్ ఆడియన్స్ ఎక్కువగా ఈ థియేటర్ కు పోటీపడే పరిస్థితి ఉంటుంది. పవన్ కళ్యాణ్… తొలిప్రేమ సినిమా ఏకంగా 227 రోజులు ఈ థియేటర్లో ఆడింది. ఇక ఇదే థియేటర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా నిలిచింది. ఒకప్పుడు 1500 మంది ప్రేక్షకులకు కెపాసిటీతో ఉండే సంధ్య థియేటర్ ఆ తర్వాత అప్గ్రేడ్ చేసి 1323 కి సీటింగ్ కెపాసిటీని తగ్గించారు. ఇక సంధ్య థియేటర్లో 70mm తో పాటుగా 35 ఎంఎం థియేటర్ కూడా ఉంటుంది. 1981లో సంధ్య 35 ఎంఎం థియేటర్ మొదలైంది.
ఇక్కడ సంధ్య థియేటర్లో థర్డ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, లోయర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీ, బాక్స్ ఏ, బాక్స్ బి సీటింగ్ ఆప్షన్లు ఉంటాయి. థర్డ్ క్లాస్ టికెట్ 70 రూపాయలు ఉంటాయి. ఇక బాక్స్ సీట్ల కోసం 200 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. హై అండ్ డాల్బీ డిజిటల్ అరౌండ్ ఎక్స సౌండ్ సిస్టం సంధ్య థియేటర్ లో ఉంటుంది. ఇంత చరిత్ర ఉన్న సంధ్యా థియేటర్ ఇప్పుడు కనుమరుగైపోయే అవకాశం కనబడుతోంది. హైదరాబాద్ పోలీసులు ఈ థియేటర్ విషయంలో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో లైసెన్స్ రద్దు చేస్తామని నోటీసులు జారీ చేశారు తెలంగాణ పోలీసులు.