Samantha: ఆ యంగ్‌ హీరోతో ప్రేమలో పడ్డ సమంత !?

కావాలని చేస్తుందో లేక ఆమె తలరాత అంతేనో తెలియదు కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది హీరోయిన్‌ సమంత. నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత ఏం చేసినా అది వైరల్‌గానే మారిపోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 17, 2023 | 05:19 PMLast Updated on: Jun 17, 2023 | 5:19 PM

There Are Some Reports That After Her Divorce Samantha Fell In Love With A Man Named Varun And The Two Are Hanging Out Together

ఈ అమ్మడు గురించి ఎలాంటి గాసిప్‌ వచ్చినా అది సినీ వర్గాలన్నిటినీ చుట్టేస్తుంది. ఇప్పటికే అలా చాలా గాసిప్స్‌ వచ్చాయి. కానీ ఇప్పుడు వినిపిస్తున్న రూమర్‌ మాత్రం సనీ వర్గాలతో పాటు సామ్‌ ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేస్తోంది. సమంత ఓ యంగ్‌ హీరోతో ప్రేమలో ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌. ప్రస్తుతం సమంత, వరుణ్‌ ఇద్దరూ సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. షూటింగ్‌ గ్యాప్‌ దొరికిన ప్రతీసారి పార్టీలు, పబ్బులు, డిన్నర్లు అంటూ తెగ తిరిగేస్తున్నారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ ప్రమేలో పడ్డట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.

రీసెంట్‌గా ఓ పబ్‌లో సమంతా డాన్స్‌ చేస్తున్న వీడియోలో కూడా వరుణ్‌ పక్కనే ఉన్నాడు. ఆ తరువాత రోజు కూడా వరుణ్‌తో లంచ్‌ చేస్తున్న ఫొటోను సమంత షేర్‌ చేసింది. ఇవే కాదు.. వీళ్లిద్దరు బయట తిరిగిన చాలా ఫొటోస్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది సమంత. దీంతో వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు గాసిప్స్‌ వస్తున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఏంటి అంటే వరుణ్‌ ధావన్‌ తన భార్య నటాషా దలాల్‌తో విడాకులు తీసుకోబోతున్నాడంటూ రీసెంట్‌గానే బీ టౌన్‌లో తెగ రూమర్స్‌ వచ్చాయి. కానీ వాళ్లదరిదీ లవ్‌ మ్యారేజ్‌ కావడంతో ఎవరూ వాటిని అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వరుణ్‌ సమంతతో ఇంత క్లోజ్‌గా ఉంటుండటంతో ఏదో జరగబోతోందని అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం సిటాడెల్‌ షూటింగ్‌ బిజీలో ఉన్న ఈ ఇద్దరూ ఎలాంటి షాకింగ్‌ న్యూస్‌ చెప్పబోతున్నారో చూడాలి.