Ram Charan Vs Allu Arjun: చరణ్ వర్సస్ అల్లు అర్జున్
ఇక మెగా కాంపౌండ్ కి అల్లు అర్జున్ ఇంటికి దూరం కూడా చాలా పెరిగిందనే మాటలే వినిపిస్తున్నాయి.

There is a discussion going on that there is a cold war going on between Allu Arjun and Ram Charan
రామ్ చరణ్, బన్నీ మధ్య ఈక్వెషన్స్ బాలేవని ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మెగా కాంపౌండ్ కి అల్లు అర్జున్ ఇంటికి దూరం కూడా చాలా పెరిగిందనే మాటలే వినిపిస్తున్నాయి. ఇవన్నీ అటుంచితే, ఇవి రూమర్లు కాదు నిజాలే అనేలా చెర్రీ, బన్నీ ఓపెన్ అయిపోయారా? అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డ్ వస్తే చరణ్ విష్ చేసిన విధానం మీద చర్చ పెరిగింది. ఎందుకంటే తను పోస్ట్ చేసిన లెటర్ లో ముందు త్రిబుల్ ఆర్ టీం, తర్వాత వైష్ణవ్ తేజ్, ఆతర్వాత దేవిశ్రీ తోపాటు బన్నీని విష్ చేశాడు. గుంపులో గోవిందయ్యగా బన్నీని ట్రీట్ చేశాడని అంటున్నారు.
దీనికి కారణం కూడా ఉంది. త్రిబుల్ ఆర్ మూవీ సాంగ్ కి ఆస్కార్ వచ్చినప్పుడు బన్నీ త్రిబుల్ ఆర్ టీం తోపాటు చెర్రీని విష్ చేశాడు.. అలా తను గుంపులో గోవిందగా చెర్రీని మార్చి విష్ చేయటం వల్లే, చరణ్ కూడా ఇప్పుడు బన్నీని అలానే విష్ చేశాడనంటున్నారు. విచిత్రం ఏంటంటే చరణ్ పోస్ట్ కి బన్నీ కేవలం థ్యాంక్యూ అంటూ రిప్లే ఇచ్చాడే కాని, చరణ్ పేరు కూడా ఎత్తలేదు. ఇక్కడే ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందో, కోల్డ్ వార్ ఏరేంజ్ లోనడుస్తుందో అర్ధం అవుతోందనే గుసగుసలు పెరిగాయి. మెగా ఫ్యాన్స్ లో కొంతమంది ఓపెన్ గానే బన్నీ వ్యవహార శైలిని తప్పు పడుతున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ కూడా కోల్డ్ వార్ లానే ఉంది కాని కంప్లీట్ ఓపెన్ మాత్రం కాలేదు. ఏదేమైనా ఫిల్మ్ నగర్ లో మాత్రం వీళ్ల కోల్డ్ వార్ మీద ఓపెన్ గా చర్చ జరుగుతోంది.