Nayanthara Trisha : నయనతారను కొట్టేసిన త్రిష..
తమిళ్ ఇండస్ట్రీ హీరోయిన్లలో త్రిష, నయనతార మధ్య ఎప్పటి నుంచో పోటీ ఉంది. బేసిక్‌గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే కెరీర్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

There is a rivalry between Trisha and Nayanthara among the heroines of the Tamil industry since time immemorial.
తమిళ్ ఇండస్ట్రీ హీరోయిన్లలో త్రిష, నయనతార మధ్య ఎప్పటి నుంచో పోటీ ఉంది. బేసిక్‌గా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే కెరీర్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటున్నారు. ఐతే ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో నయనతారను దాటేసి త్రిష నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. దక్షిణాదిలోనే నంబర్‌వన్ కథానాయకిగా నయనతారకు పేరు ఉంది. ఇప్పుటికీ ఆమె ఏ మాత్రం తగ్గలేదు. అయితే త్రిష క్రేజ్ మాత్రం పెరిగింది. ఇదంతా మణిరత్నం పుణ్యమే. త్రిష కెరీర్ పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారింది. ఓటైమ్‌లో త్రిష పని అయిపోయిందనుకున్నారు అంతా.
ఆమె చేసిన హీరోయిన్ ఓరియన్‌టెడ్ మూవీస్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర ఢమాల్ అనేశాయ్. చేతిలో సినిమాలు కూడా లేని పరిస్థితులు కనిపించాయ్. అలాంటి టైమ్‌లో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కందవై పాత్రలో నటించే అవకాశం దక్కింది. అందులో నటి ఐశ్వర్యరాయ్ కూడా యాక్ట్ చేసినా.. త్రిష డామినేట్ చేశారు. ఆ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయ్. విజయ్ లియో మూవీలోనూ యాక్ట్ చేసింది. దానికోసం 6 కోట్లు పారితోషికం పుచ్చుకున్న త్రిష..
ఇప్పుడు కమలహాసన్ సరసన నటిస్తున్న థగ్స్ లైఫ్ చిత్రం కోసం ఏకంగా 12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. లేడీ సూపర్‌స్టార్ అని పేరు ఉన్న నయనతార కూడా.. ఇప్పటివరకు ఈ లెవల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు. దీంతో నయన్‌ను కొట్టేసిన త్రిష.. ఇప్పుడు నంబర్‌వన్ స్థానానికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఐతే నయన్ కూడా తగ్గేదే లే అంటోంది. వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. ఈ ఇద్దరికి ఏజ్ పెరుగుతున్నా కొద్దీ అందం పెరిగినట్లు కనిపిస్తోంది. మరి త్రిషకు పోటీ ఇవ్వడానికి నయన్ ఎంత డిమాండ్ చేస్తుందో చూడాలి.