రూ.1200 ఇచ్చే దిక్కులేదు కాని.. 1000 కోట్ల కోరికలు…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవటమేకాదు, అసలా సినిమా వచ్చి వెల్లిందనే విషయం కూడా చాలా మంది మర్చిపోయారు. కాని 1200 రూపాయలకు కక్కుర్తి పడ్డ గేమ్ ఛేంజర్ టీం అన్న వార్త తో దిల్ రాజు అండ్ టీ ట్రోలింగ్ కి గురౌతోంది. మొన్నటి కి మొన్న డైరెక్టర్ శంకర్ రోబో కథ కాపీ కొట్టాడని 10 కోట్ల ఆస్తులు జప్తు చేశారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అవటమేకాదు, అసలా సినిమా వచ్చి వెల్లిందనే విషయం కూడా చాలా మంది మర్చిపోయారు. కాని 1200 రూపాయలకు కక్కుర్తి పడ్డ గేమ్ ఛేంజర్ టీం అన్న వార్త తో దిల్ రాజు అండ్ టీ ట్రోలింగ్ కి గురౌతోంది. మొన్నటి కి మొన్న డైరెక్టర్ శంకర్ రోబో కథ కాపీ కొట్టాడని 10 కోట్ల ఆస్తులు జప్తు చేశారు. ఇప్పుడేమో, సినిమా తీయటానికి వందల కోట్లు పెట్టినవాళ్లకి, 1200 రూపాయలు ఇవ్వలేకపోయారా అని అంటున్నారు. 1200 రూపాయలు ఇవ్వటానికి వాల్లకి చేతులు రాలేదా అన్న కామెంట్లు పరువు తీస్తున్నాయి. ఒక వైపు సినిమా డిజాస్టరైంది. రెండో వైపు శంకర్ మీద కాపీ కేసు షాకిచ్చింది. ఇప్పుడు జస్ట్ 1200 రూపాయాలివ్వలేదన్న జూనియర్ ఆర్టిస్టుల కేసు పరువుతీస్తోందట. దీనికి తోడు గేమ్ ఛేంజర్ మూవీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు మాజీ ఐఏఎస్ ఆఫీసర్. మాజీ కలెక్టర్ చేసిన కామెంట్లతో గేమ్ ఛేంజర్ పరువు, పాన్ ఇండియా లెవల్లో మరోసారి పోతోంది.
గేమ్ ఛేంజర్ మూవీ ఫ్లాపై, డిజాస్టర్ గా తేలాక కూడా ఇంకా దిల్ రాజు అండ్ టీం కి కామెంట్లు తప్పట్లేదు. కొత్తగా జూనియర్ ఆర్టిస్ట్ లకు పారితోషికం ఎగవేసిన కేసు గేమ్ ఛేంజర్ ని మళ్లీ వైరలయ్యేలా చేస్తోంది. విజయ వాడనుంచి 350 మంది జూనియర్ ఆర్టిస్టులని గేమ్ ఛేంజర్ కోసం తీసుకొచ్చిన ఈ సినిమా కో డైరెక్టర్, వాల్లకి రెమ్యునరేషన్ ఇవ్వలేదట.350 మందికి 1200 చొప్పున లెక్కేస్తే420000 ఎమౌంట్ రావాలి. కాని దాన్ని గేమ్ ఛేంజర్ కో డైరెక్టర్ ఎగ్గొట్టాడని కేసు ఫైల్ అయ్యిందట. విచిత్రం ఏంటంటే హిట్ అయితే లోపాలు బయట పడవు.. అదే సినిమా ఫ్లాపైతే ప్రతీ లోపం పాపమైపోతుంది. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కి అలాంటివే రెండు వారాలకొక పంచ్ తగులుతున్నట్టుంది.
మొన్నటికి మొన్న స్టార్ డైరెక్టర్ శంకర్ తన మూవీ రోబో కథ కాపీ విషయంలో బ్లేమ్ అయ్యాడు. ఒకరి కథని కాపీ కొట్టాడని ఈడీ వచ్చి 10 కోట్ల విలువైన శంకర్ ఆస్తిని జప్తు చేసింది. ఒక వైపు గేమ్ ఛేంజర్ ఫ్లాపై కామెంట్లు, తర్వాత అల్లు అరవింద్ వచ్చి దిల్ రాజుని పొగుడుతూనే గేమ్ ఛేంజర్ ని పరోక్షంగా ట్రోల్ చేసినట్టు మాట్లాడటం వైరలైంది. తర్వాత తను సారి చెప్పాడు అదివేరే విషయం. కాకపోతే ఏదో ఒక నెగెటీవ్ కోణంలోనే ఈ సినిమా మీద వార్తలొస్తున్నాయి. వారానికో రెండు వారాలకో ఇలా ఏదో ఒక గోల కామనైంది. దీనికి తోడు మాజీ ఐఏఎస్ కూడా గేమ్ ఛేంజర్ లో నాయకులని, కలెక్టర్లని చూపించిన విధానం బాలేదని విమర్శించాడు. తెలివి, చదువు ఉన్నంత మాత్రన నాయకులంటే అంత చులకనా అంటూ గట్టిగానే ఇచ్చిపడేశాడు.
లోక్ సత్తా స్థాపించిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయన్ గేమ్ ఛేంజర్ మూవీ మీద చేసిన విమర్శలు నిదానంగా వైరలయ్యాయి. రౌడీ నాయకులను విమర్శించే ప్రాసెస్ లో ప్రజాస్వామ్యాన్ని కించపరిచారంటూ తనే ఇలా అనటం, ఒక మాజీ ఐఏసెస్ నుంచి ఇలాంటి విమర్శలు రావటంతో గేమ్ ఛేంజర్ మీద మళ్లీ ట్రోలింగ్ పెరిగాయి.చరణ్ యాంటీ ఫ్యాన్సే కాదు, ట్రోలింగే పనిగా పెట్టుకున్న బ్యాచ్ కి ఇదో మంచి సరుకుగా మారింది. ఒకవైపు జూనియర్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్ ఎగ్గొట్టడం, శంకర్ మీద కథ కాపీ వివాదం, దీనికి తోడు అల్లు అరవింద్ మాట మిస్ ఫైర్ అవటం, ఇప్పుడు లోక్ సత్తా స్థాపించిన జయప్రకాష్ నారాయణ్ విమర్శలు..ఇవన్నీ కలుపుకుని, గేమ్ ఛేంజర్ మీద ట్రోలింగ్ పెరగటానికి కారణమయ్యాయి.