అసలుకే దిక్కులేదు… ఇంకా కొసరేంటని కామెంట్స్ …!

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ మీద సెటైర్లు పేలుతున్నాయి. బేసిగ్గా ప్రభాస్ సినిమా వస్తోందంటే యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తగులుకుంటారు. కావాలని బురద చల్లుతారు.. ఇది ఇప్పిటి వరకున్న అభిప్రాయం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 25, 2025 | 08:00 PMLast Updated on: Feb 25, 2025 | 8:00 PM

There Is No Real Direction More Comments

రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ మీద సెటైర్లు పేలుతున్నాయి. బేసిగ్గా ప్రభాస్ సినిమా వస్తోందంటే యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తగులుకుంటారు. కావాలని బురద చల్లుతారు.. ఇది ఇప్పిటి వరకున్న అభిప్రాయం. కాని ది రాజా సాబ్ ఇప్పుడప్పుడే రావట్లేదు. అసలు ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. కాని ఇంతలోనే ట్రోలింగ్ కి గురౌతోంది. అంతటికీ కారణం ఈ సినిమా సీక్వెల్ ఏర్పాట్ల మీదొస్తున్న వార్తలే…అదేదో డెయిలీ సీరియల్ లా షూటింగ్ రెండే ళ్లనుంచి సాగుతున్న సినిమా, ఇంకా పూర్తి కాలేదు. ఫినిష్ కాబోతోందన్న మాటే కాని, ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు. ఏప్రిల్ 10 విడుదల అన్న మాట కూడా వాయిదాతో మారిపోయింది. అలాంటి మూవీని పూర్తి చేయటమో, రిలీజ్ చేయటమో చేయాలి… అది హిట్ అయితే అప్పుడు సీక్వెల్ మాటెత్తాలి.. కాని అప్ డేట్లు లేవు… అడ్రస్ లేదు… కాని అప్పుడే సీక్వెలా అంటూ ట్రోలింగ్ పెంచారు. ఈ సారి ఫ్యాన్స్ నుంచి కూడా ఈ ట్రోలింగ్ కి కౌంటర్ ఎటాక్ కనిపించట్లేదు…

ది రాజా సాబ్ ఇంకా రిలీజ్ కాలేదు. ఏప్రిల్ 10 కి విడుదల అన్నారు.కాని అప్పుడొచ్చేలా లేదు. మే, జూన్ కాదు కదా దసరాకి రావటం కూడా కష్టమే అంటున్నారు. కేవలం నాలుగు పాటల షూటింగ్, క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ కి నెల కేటాయిస్తే, షూటింగ్ ఫినిష్ అవుతుంది. కాని అదే అయ్యేలా లేదు. ఆల్రెడీ ఫౌజీ షూటింగ్ జరుగుతోంది. మేలో స్పిరిట్ మొదలు కాబోతోంది.ఆలోపు కూడా ది రాజా సాబ్ షూటింగ్ పూర్తవ్వటం కష్టంగానే కనిపిస్తోంది. అలాంటిది అప్పుడే దీనికి సీక్వెల్ అంటూ ఫీలర్స్ వదలటంతో మ్యాటర్ రివర్స్ అవుతోంది. అసలే అప్ డేట్లు లేక, ఎప్పుడు ది రాజా సాబ్ వస్తుందో తెలియన రెబల్ ఫ్యాన్స్ కి మారుతి మీద కాస్త కోపమే కనిపిస్తోంది. దీనికి తోడు ది రాజా సాబ్ మోషన్ పోస్టర్ అసలేమాత్రం ఇంప్రెసివ్ గా లేదు.

అసలు మ్యాటర్ అదిరిపోతుంది అని ఫిల్మ్ టీం ఎంత చెప్పిరా, ఏదైనా ప్రోమోనో, టీజరో అదిరిపోయేలా వస్తే ఫ్యాన్స్ కూడా కూల్ అయ్యేఛాన్స్ఉంది. కాని అలాంటి ప్రయత్నాలేవి కనిపించలేదు. అలాంటి టైంలో పుండు మీద కారం చల్లినట్టు అసలుకే దిక్కులేదు, కొసరన్నట్టు ది రాజా సాబ్ సీక్వెల్ అన్న వార్త ఫ్యాన్స్ కి రుచించినట్టు లేదు.అందుకే యాంటీ ఫ్యాన్స్ చేసే ట్రోలింగ్ కి కౌంటర్ గా ఫ్యాన్స్ ఎటాక్ ఎక్కడా కనిపించట్లేదు. ది రాజా సాబ్ 2.0 రాజా సాబ్ 3.0 అంటూ కొందరు చేసిన ట్రోలింగ్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఇదంతా ఎటాకారం ఎక్కువయ్యే చేస్తున్న విష ప్రచారం అంటున్నారు. దానికి రెబల్ ఫ్యాన్స్ రియాక్ట్ కాకపోవటానికి రీజన్ కనిపించట్లేదు. ఒకవేల వాళ్లకి కూడా ది రాజా సాబ్ రిలీజ్ డేట్ వాయిదాలు, షూటింగ్ డిలే వల్ల ఆసక్తి తగ్గిందేమో అన్న అభిప్రాయం కనిపిస్తోంది.

ఏదేమైనా రాధేశ్యామ్, ఆదిపురుష్ రెండు హిట్ కాకున్నా 300 కోట్లు, 650 కోట్ల పెట్టుబడిని తిరిగి రాబట్టాయి ఆ సినిమాలు. కాని ది రాజా సాబ్ ప్రాజెక్ట్ అలా అంతో ఇంతో సేఫ్ అనలేం. ఒకటి ప్రభాస్ లాంటి కటౌట్ హర్రర్ మూవీ చేయటం, రెండు అది కామెడీ హర్రర్ జోనర్ అవటం.. అందుకే రెండూ కూడా రిస్క్ ఫ్యాక్టర్లే… హిట్టైతే పండగే, కాకపోతే ఏంటనే కంగారు కూడా ఉంది. అలాంటప్పుడు ఈ మూవీని రిలీజ్ చేసి రికార్డులు క్రియేట్ చేస్తున్నప్పుడు సీక్వెల్ ప్రకటించాలి… అంతేకాని ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు అప్పడే ది రాజా సాబ్ సీక్వెల్ తాలూకు ఫీలర్సే సెటైర్లకు కారణమౌతున్నాయి.