Ramcharan : ఐఏఎస్ ఆఫీసర్ కి రామ్ చరణ్ ముగింపు
మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. లక్షలాది మంది అభిమానులు ఆయన సొంతం.

There is nothing new to say about the fan base of Mega Power Star Ram Charan.
మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan) కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. లక్షలాది మంది అభిమానులు ఆయన సొంతం. ఇప్పుడు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెలుపుతో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ ఆనందంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడనే వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
చరణ్ గేమ్ చేంజర్ (Game Changer) అన్న విషయం అందరకి తెలిసిందే. మునుపెన్నడు లేని విధంగా మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు గేమ్ చేంజర్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్ దర్శకుడు కావడంతో శంకర్ డైరెక్షన్ లో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో అనే కుతూహలం వాళ్ళల్లో ఉంది. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకం రావడంతో చిత్రీకరణ లేటు అవుతు వస్తుంది. కొన్ని రోజుల క్రితం రెగ్యులర్ గా షూటింగ్ ని జరుపుకున్నా కూడా మళ్ళీ బ్రేక్ వచ్చింది. ఇప్పుడు చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ విషయంలో వేగాన్ని పెంచుతున్నాడు. మరో 10 రోజుల్లో షూటింగ్ ని ముగించేందుకు ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన క్యారక్టర్ కి సంబంధించిన వెర్షన్ మొత్తానికి గుమ్మడి కాయ కొట్టబోతున్నాడని తెలుస్తుంది.
చరణ్ ఐఏఎస్ (Charan IAS) ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. కియారా అద్వానీ రెండో సారి చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. జర్నీ అండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ఒక కీలక పాత్రలో నటిస్తోంది. పవన్ ఖుషి డైరెక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా చేస్తున్నాడు. హిట్ చిత్రాల మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు