సీమ గడ్డ దేవరదే, సీడెడ్ లో దేవర కోట్ల లెక్కలు ఇవే

అమెరికా లేదు అమలాపురం లేదు. ఢిల్లీ లేదు గల్లీ లేదు... గుజరాత్ లేదు గుంతకల్లు లేదు... ఒక్కో రికార్డ్ ని మడత పెట్టి తొక్కుకుంటూ పోతుంది దేవర. డివైడ్ టాక్ ఏ రేంజ్ లో వచ్చినా సినిమా వసూళ్లు మాత్రం ఎక్కడా ఆగలేదు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 5, 2024 | 04:29 PMLast Updated on: Oct 05, 2024 | 4:29 PM

These Are The Calculations Of Devara In Seeded

అమెరికా లేదు అమలాపురం లేదు. ఢిల్లీ లేదు గల్లీ లేదు… గుజరాత్ లేదు గుంతకల్లు లేదు… ఒక్కో రికార్డ్ ని మడత పెట్టి తొక్కుకుంటూ పోతుంది దేవర. డివైడ్ టాక్ ఏ రేంజ్ లో వచ్చినా సినిమా వసూళ్లు మాత్రం ఎక్కడా ఆగలేదు. నెగటివ్ టాక్ తో సినిమా రాడ్ అని చెప్పినా హిందీలో గాని అమెరికాలో గాని కన్నడలో గాని తెలుగు రాష్ట్రాల్లో గాని ఎక్కడా దేవర జాతర ఆగలేదు. మరో సినిమా లేకపోవడమో, సినిమా మౌత్ టాక్ బాగుంది అని రావడమో గాని దేవర మాత్రం దూసుకుపోయింది. ఒక్కో రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంటూ వెళ్తోంది.

నైజాంలో ఎన్టీఆర్ జాతర ఏ రేంజ్ లో ఉందో చూసాం. ఇక రాయలసీమలో కూడా దేవర ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఎన్టీఆర్ కు రాయలసీమలో మంచి ఫాలోయింగ్ ఉంది. నందమూరి కుటుంబం మొత్తానికి రాయలసీమ ఎప్పుడూ అండగానే ఉంది. ఎన్టీఆర్ దాన్ని ఇంకా పెంచాడు. ఆది సినిమా నుంచి అది బాగా మొదలైంది. ఇక అరవింద సమేత సినిమాతో రాయలసీమను కమ్మేసాడు దేవర. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు సీడెడ్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో అది పక్కాగా ప్రూవ్ అయింది కూడా.

సీడెడ్ లెక్కలు ఒకసారి చూస్తే… అనంతపురంలో ఆరు రోజుల్లో 2 కోట్లకు పైగా వసూలు చేసింది దేవర. కర్నూలులో… 2 కోట్ల 26 లక్షలకు పైగా వసూలు చేసింది. అలాగే కడపలో కోటి 60 లక్షల వరకు వసూలు చేసింది. తిరుపతిలో అత్యధికంగా 2 కోట్ల 57 లక్షలు వసూలు చేసింది దేవర. నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అన్నీ ఇక్కడ దేవర బ్రేక్ చేసింది. దీనితో ఎన్టీఆర్ కు సీడెడ్ లో తిరుగు లేదు అని ప్రూవ్ అయింది. ఈ ప్రభావం అటు కన్నడలో కూడా భారీగా పడింది అనే చెప్పాలి. రాయలసీమ జనాలు ఎక్కువగా ఉండేది కర్ణాటకలోనే. అక్కడ ఎన్టీఆర్ దమ్ము ఏంటో చూపించారు.