చైతు-శోభిత పెళ్లి గెస్ట్ లు వీరే, “మాస్, రెబల్” మ్యారేజ్

టాలీవుడ్ స్టార్ జంట అక్కినేని నాగచైతన్య. శోబిత ధూళిపాళ్ల వివాహం ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఈ వివాహానికి అక్కినేని ఫ్యామిలీ ఎవరిని ఆహ్వానించింది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 4, 2024 | 12:01 PMLast Updated on: Dec 04, 2024 | 12:01 PM

These Are The Guests At Chaitu Sobhithas Wedding A Mass Rebel Marriage

టాలీవుడ్ స్టార్ జంట అక్కినేని నాగచైతన్య. శోబిత ధూళిపాళ్ల వివాహం ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఈ వివాహానికి అక్కినేని ఫ్యామిలీ ఎవరిని ఆహ్వానించింది అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా తక్కువ మందితో వివాహం చేసుకుంటున్నామని, అన్నపూర్ణ స్టూడియోలోనే వివాహాన్ని చాలా ప్రత్యేకంగా జరుపుతున్నామని అక్కినేని నాగార్జున ఇప్పటికే ప్రకటించారు. దీనితో ఈ వివాహానికి ఎవరిని ఆహ్వానిస్తారనే దానిపై స్పష్టత రావడం లేదు.

అయితే తాజాగా వస్తున్న వార్తలు ప్రకారం వివాహానికి బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులతో పాటుగా తమిళ సినిమా పరిశ్రమ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. అలాగే తమిళనాడు నుంచి ఓ ముఖ్య రాజకీయ నాయకుడు కూడా వివాహానికి హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కర్ణాటకకు చెందిన ఒక కాంగ్రెస్ కీలక నేత కూడా ఈ వివాహానికి రానున్నట్లుగా సమాచారం. ఏపీ తెలంగాణ నుంచి ఎవరు హాజరవుతారు అనే దానిపై మాత్రం స్పష్టత లేదు. రాజకీయ నాయకులను ఆహ్వానించారా అనే క్లారిటీ రావడం లేదు.

ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి లకు అక్కినేని నాగార్జున ఆహ్వాన పత్రిక ఇచ్చారా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఇక శోభితకు బాలీవుడ్ లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే నాగచైతన్యకు కూడా బాలీవుడ్ లో మంచి స్నేహితులే ఉన్నారు. దీనితో వారిని ఈ వివాహానికి ఆహ్వానించినట్లుగా సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అలాగే ఆదిత్య రాయ్ కపూర్ ను శోభిత ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అలాగే హీరోయిన్ పరిణితి చోప్రా అలాగే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కూడా ఈ వివాహానికి హాజరై అవకాశం కనబడుతోంది.

ఇక మన తెలుగు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ వివాహానికి హాజరుకానున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటుగా దర్శకుడు రాజమౌళి కూడా ఆహ్వాన పత్రిక అందింది. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారా లేదా అనే దానిపై మీడియా వర్గాలకు క్లారిటీ లేదు. మరికొన్ని గంటల్లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరగనున్న ఈ వివాహాన్ని ప్రముఖ ఓటీపీ సంస్థ నెట్ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇక ఈ పెళ్లిలో అక్కినేని ఫ్యామిలీ, శోభిత ఫ్యామిలీ ఇస్తున్న గిఫ్ట్ లు హాట్ టాపిక్ గా మారాయి. గెస్ట్ లు 300 మంది అయినా సరే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసింది అక్కినేని ఫ్యామిలీ. ఏ మాత్రం హడావుడి లేకుండా ఈ వివాహ తంతును పూర్తి చేయాలని నాగార్జున ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారట.