Kalki : కల్కి ‘బుజ్జి’ హైలెట్స్ ఇవే?

కల్కి సినిమాలో బుజ్జి అనేది ప్రభాస్ కారు పేరు. ఈ కారును చాలా డిఫరెంట్‌గా త‌యారు చేయించారు మేకర్స్. అందుకే స్పెషల్ ఈవెంట్‌తో బుజ్జిని గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 24, 2024 | 10:37 AMLast Updated on: May 24, 2024 | 10:37 AM

These Are The Highlights Of Kalki Buzzy

కల్కి సినిమాలో బుజ్జి అనేది ప్రభాస్ కారు పేరు. ఈ కారును చాలా డిఫరెంట్‌గా త‌యారు చేయించారు మేకర్స్. అందుకే స్పెషల్ ఈవెంట్‌తో బుజ్జిని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. దీంతో.. అసలు బుజ్జిని ఎవరు తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు అనే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో బుజ్జికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలు బయటకొచ్చాయి. బుజ్జిని ప్రముఖ కంపెనీలైన మహీంద్రా, జయెమ్‌ ఆటోమోటివ్‌ సంస్థలు రూపొందించాయి. ఈ కారును తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారు చేశారు. బుజ్జిని దాదాపు ఆరు టన్నుల బరువుతో రూపొందించారు.

ఈ కారు తయారికీ దాదాపు 7 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ముందు రెండు, వెనుక భాగంలో ఒక టైరు మాత్రమే కలిగి ఉన్న బుజ్జికి చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి.ఇది గాల్లో కూడా ఎగరగలదు. స్క్రాచ్‌తో తయారు చేసిన ఒక్కొక్క టైర్ రిమ్ సైజ్ 34.5 ఇంచులుగా ఉంటుందని అంటున్నారు. టైర్‌తో కలిపి ఇది దాదాపు ఒక మనిషిలో సగానికి పైగా హైట్‌తో భారీ సైజుతో ఉంది. 6075 MM లెంగ్త్, 3380 MM విడ్త్, 2186 MM హైట్‌తో బుజ్జిని డిజైన్ చేశారు. 9800 న్యూటన్ మీటర్ టార్క్, 94 కిలో వాట్స్ పవర్‌, 47 కిలోవాట్ అవర్ బ్యాటరీతో బుజ్జి నడుస్తుంది.

ఇదే కాదు.. సినిమాలో బుజ్జి గురించి ఇంకా చాలా సర్ప్రైజ్‌లు ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా.. భవిష్యత్‌లో ఉండే కార్ ఎలా ఉంటుందో ఊహించుకొని బుజ్జిని డిజైన్ చేశారు. ఇక బుజ్జితోనే దేశమంతటా ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ముంబై, చెన్నై, కొచ్చి, బెంగ‌ళూరు లాంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో బుజ్జిని ప్రమోషన్స్ కోసం తీసుకెళ్లనున్నారు. మరి బుజ్జి గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే.. జూన్‌ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.