Adipurush: ఆదిపురుష్ ఫ్లాప్ అవ్వడానికి కాణాలు ఇవే..
ఆదిపురుష్ ట్రైలర్ చూసినప్పటి నుంచీ ప్రభాస్ ఫ్యాన్స్ దేని గురించి భయపడ్డారో సినిమా రిలీజ్ అయ్యాక సరిగ్గా అదే జరిగింది. మొదటి షోతోనే ఆదిపురుష్ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్, సినిమాను కంపేర్ చేసి చూస్తే.. జస్ట్ ట్రోలింగ్ నుంచి తప్పించుకునేందుకు ట్రైలర్‌ను ఎడిట్ చేసినట్టు క్లియర్‌గా తెలిసిపోయింది.
ప్రభాస్ రాముడిగా కనిపించినా, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినా ఆదిపురుష్ సినిమా గురించి నెగటివ్ టాక్ రాడానికి చాలా కారణాలున్నాయి. ఆదిపురుష్ సినిమా కేవలం యుద్ధ కాండ మాత్రమే. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడంతోనే సినిమా మొదలౌతుంది. రాముడి ఎంట్రీ సీన్‌లో ఓ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ గురించి ఇప్పటి వరకూ రామాయణంలో వినలేదు. ఆ ఫైట్ ఎందుకు వచ్చిందో.. ఆ దెయ్యాలను ఎవరు పంపారో ఎవరికీ అర్థం కాలేదు. ఇక రామాయణంలో లక్ష్మణ రేఖ గురించి ఒక్కసారి మాత్రమే ప్రస్తావించబడింది. కానీ ఆదిపురుష్ సినిమాలో రెండు సందర్భాల్లో లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీస్తాడు. శూర్పనక రాముడి వెంటపడ్డప్పుడు లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోస్తాడు. బాణంతో ముక్కు చెవులు కోయడం ఇప్పటి వరకూ మనం విన్నాం. కానీ ఆదిపురుష్ సినిమాలో లక్ష్మణుడు శూర్పనక మీదకు బాణం సంధిస్తాడు.
ఒక స్త్రీ మీదకి లక్ష్మణుడు బాణం సంధించడం ఈ రామాణంలోనే మొదటి సారి చూశాం. ఇక రావణుడు అంటేనే రాక్షసుడు. అలాంటిది రావణున్ని ఈ సినిమాలో చాలా స్టైలిష్‌గా చూపించారు. రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లిన విషయం జటాయువు చెప్పే వరకూ రాముడికి తెలియదు. కానీ ఆదిపురుష్ సినిమాలో రావణాసుడు సీతను ఎత్తుకెళ్తున్న సమయంలో రాముడు, లక్ష్మణుడు వెంబడిస్తారు. జటాయువు వాళ్ల కళ్లముందే కూలిపోతుంది. ఇది ఆడియన్స్‌కు కొత్తగా అనిపించింది. ఇక జావంబవంతుడు, సుగ్రీవుడు లాంటి క్యారెక్టర్స్‌ను యానిమేటెడ్‌గా చూపించడంతో వాళ్ల ఇంపాక్ట్ ఆడియన్స్ మీద లేకుండా పోయింది.
ఇక హనుమాన్ క్యారెక్టర్ అద్భుతంగా ఉన్నా.. తెలుగు వెర్షన్‌లో ఒక్కసారి కూడా హనుమంతుడు జైశ్రీరామ్ అనలేదు. హనుమంతుడు అంటేనే నిత్యం రామనామం జపించే భక్తుడు. అలాంటి హనుమాన్ జైశ్రీరాం అని కూడా అనకపోవడం మైనస్ పాయింట్. కేవలం హనుమంతుడే కాదు.. జైశ్రీరాం పాట తప్ప సినిమాలో ఎవ్వరూ జైశ్రీరాం అనలేదు. అసలు ఆదిపురుష్ సినిమాలో రాముడిని రాఘవ అనే పిలిచారు. అక్ష్మణుడిని శేషు అని, సీతను జానకి అని, హనుమంతుడిని భజరంగ్ అని పిలిచారు. ఈ పేర్లు నిజమే అయినప్పటికీ అంతా రాముడు సీత అనే పేర్లకు అలవాటుపడి ఉండటంతో కొత్త పేర్లకు ఆడియన్స్ పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు.
రాముడి సముద్రాన్ని దాటేందుకు సముద్ర దేవుడిపై బ్రాహ్మాస్త ప్రయోగానికి సిద్ధమౌతాడు. కానీ సముద్ర దేవుడు ప్రత్యక్షమవడంతో తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. రాముడు ఎక్కుపెట్టిన బాణం.. అదీ బ్రహ్మాస్త్రం వెనక్కి తీసుకున్నట్టు ఇప్పటి వరకూ ఏ రామాయణంలోనూ లేదు. కానీ ఆదిపురుష్ సినిమాలో ఎక్కుపెట్టిన బాణాన్ని రాముడు చాలా సార్లు వెనక్కి తీసుకున్నాడు. ఇక లంక విషయానికి వస్తే.. లంక అనేది స్వర్ణ నగరం. అశోకవనం అత్యంత సుందరమైన ప్రదేశం. కానీ లంకను ఓ బొగ్గుగనిలా, నరకానికి ప్రతిరూపంలా చూపించారు. అశోకవనాన్ని కొండ అంచుగా చూపించారు.
రావణుడిని విలన్‌గా చూపించాలంటే అతని క్యారెక్టర్‌ని నెగటివ్ షేడ్‌లో చూపించాలి కానీ లంకను డార్క్ చేస్తే వచ్చేది ఏముంది. రావణుడి కొడుకు ఇంద్రజిత్‌ను జిత్తుల మారిగా కాకుండా ఓ మాయాజాలికుడిగా చూపించారు. వీళ్లద్దరి లుక్ విషయంలో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇక సినిమాలో యాక్టర్స్ కనీసం 20 మంది కూడా లేరు. దాదాపు అంతా యానిమేటెడ్. దీంతో రామరావణుల యుద్ధం ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, కింగ్ కాంగ్ సినిమా రెండూ కలిపి చూసినట్టు కనిపించింది. రామాయణం ఫీల్ ఎక్కడా రాలేదు. దీంతో ఓవరాల్‌గా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్ సినిమా ప్రభాస్ ఖాతాలో మరో ఫ్లాప్‌ను జమ చేసింది.