ముద్దులు ఇవ్వడానికి నేను రెడీ అంటున్న తెలుగమ్మాయి.. హలో వింటున్నారా..!
ఈ రోజుల్లో ముద్దు సన్నివేశాలు చాలా కామన్ అయిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి సినిమాలోని లిప్ లాక్ సీన్స్ తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి.

ఈ రోజుల్లో ముద్దు సన్నివేశాలు చాలా కామన్ అయిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి సినిమాలోని లిప్ లాక్ సీన్స్ తరచుగా కనిపిస్తూనే ఉన్నాయి. సెన్సార్ బోర్డు కూడా పెట్టిన చూసి చూడనట్టు వదిలేస్తుంది. చిన్న ఎమోషన్ చెప్పడానికి కిస్ సీన్ రాసుకుంటున్నారు దర్శకులు. ఎన్నో డైలాగ్స్ లో చెప్పలేని ఎమోషన్స్ ను కేవలం ఒక ముద్దు సన్నివేశంతో చూపించొచ్చు అనేది వాళ్ళ భావన. అందుకే స్టార్ హీరోలు కూడా లిప్ లాక్ సీన్స్ చేయడానికి పెద్దగా అభ్యంతరాలు చెప్పడం లేదు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఈ రోజుల్లో చాలా మంది ముద్దుగుమ్మలు ముద్దు విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఈజీగా లిప్ లాక్ సీన్స్ చేసేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరి హీరోయిన్స్ దాదాపు అందరూ ముద్దు సీన్స్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పెట్టరు.
అంతెందుకు అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్స్ కూడా టిల్లు స్క్వేర్ లో లిప్ లాక్ సన్నివేశాలతో పాటు ఇంటిమేట్ సీన్స్ బాగానే చేశారు. తాజాగా ఈ ముద్దు సన్నివేశాల గురించి ఒక ముద్దుగుమ్మ మాట్లాడింది. ఆమె ఎవరో కాదు రీతు వర్మ.. మజాకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ గ్లామర్ క్యారెక్టర్స్ మీద ఒపీనియన్ చెప్పింది. ఇప్పటి వరకు ఎందుకు మీరు పూర్తిస్థాయి గ్లామర్ లో కనిపించలేదు అంటూ అడిగితే.. దానికి ఒకే ఒక సమాధానం చెప్పింది రీతు వర్మ. తనను ఆ యాంగిల్ లో ఎవరూ చూడడం లేదు.. తెలుగమ్మాయిని కాబట్టి గ్లామర్ క్యారెక్టర్ చేస్తానో చేయనో అంటూ ఎవరు తనను అడగడం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.
తనకు అలాంటి అభ్యంతరాలు ఏమీ లేవని.. అవసరమైతే గ్లామర్ క్యారెక్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. కథ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాలు కూడా చేస్తాను అంటూ పచ్చ జెండా ఊపింది రీతూ. కాకపోతే తెలుగమ్మాయి అనే బ్రాండ్ ఉండడం వల్ల తనను కనీసం ఆ కోణంలో ఎవరూ చూడలేకపోతున్నారు అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. తన వరకు కథ వస్తే కానీ తాను అలాంటి సీన్స్ చేస్తానా లేదా అనే విషయం వాళ్లకు అర్థం అవుతుంది.. అసలు ఎవరు అప్రోచ్ కాకపోతే ఎలా తెలుస్తుంది అని ప్రశ్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఇప్పటికైనా రితు వర్మ లిప్ లాక్ సీన్స్ కు వ్యతిరేకం కాదు తెలిసింది కదా.. మరి మా దర్శకులు ఈ బ్యూటీతో గ్లామర్ క్యారెక్టర్ ఏదైనా చేయిస్తారేమో చూడాలి.