దొంగ లెక్కలు.. దొంగ పనులు.. 1850 కోట్ల పంచ్ పడినట్టే…

పుష్ప 2 మూవీ 1850 కోట్లు వసూళ్ళు రాబట్టి, బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిందన్నారు. 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసి, ఇంకా వసూల్లు రాబడితే, 2 వేల కోట్లుదంగల్ రికార్డు కూడా బ్రేక్ అవుతుందన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2025 | 06:00 PMLast Updated on: Jan 27, 2025 | 6:00 PM

Thieving Accounts Thieving Works 1850 Crore Punched

పుష్ప 2 మూవీ 1850 కోట్లు వసూళ్ళు రాబట్టి, బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిందన్నారు. 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసి, ఇంకా వసూల్లు రాబడితే, 2 వేల కోట్లుదంగల్ రికార్డు కూడా బ్రేక్ అవుతుందన్నారు. కట్ చేస్తే ఐటీ రైడ్స్ జరిగాక, సంధ్యా థియేటర్ ఇన్స్ డెంట్ కంటే ఎక్కువ డ్యామేజ్ జరిగిపోయింది. లెవల్ కోసం హీరో ఫ్యాన్స్ కోసం దొంగ కలెక్షన్స్ చెప్పామని, ఐటీ అధికారుల ముందు పుష్ప ప్రొడ్యూసర్లు ఒప్పుకున్నారా?

ఇదే ఇప్పడు ఇండస్ట్రీ పరువుతీస్తోందా? కేవలం మిగతా హీరోలకంటే తను గొప్పినిపించుకునేందుకు, బన్నీనే ఇలా ప్రొడ్యూసర్స్ మీద ప్రెజర్ పెంచాడా? ఇలాంటి డౌట్లని మించే డౌైట్లకు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ట్వీట్లే కారణమౌతున్నాయి. ఒకటి తర్వాత ఒకటి, ఇలా వరుసగ ట్వీట్లు బన్నీ క్యారెక్టర్ ని మరింత విలన్ గా ఫోకస్ చేస్తున్నాయంటున్నారు.

రవిప్రకాశ్ ట్వీట్స్ చూస్తే.. అసాధ్యం అనిపించేలా పుష్ప2 కలెక్సన్స్ అల్లు అర్జున్ ని గ్లోబల్ స్టార్ గా మారుస్తాయనుకుంటే, అది వ్యతిగతంగా దురద్రుష్టాన్నే మిగిల్చిందన్నాడు. తర్వాత, సంధ్య థియేటర్ ఘటనను, క్రూరమైన నిర్లక్ష్యంతో తొక్కిసలాట అన్నాడు. అంతే నిర్లక్ష్యంగా ప్రెస్ మీట పెట్టారనేశాడు. అంతకంటే ఘోరం ఏంటంటే పుష్ప 2 ఫుటేజ్ యాడ్ చేసి, రీలోడెడ్ అంటూ, ఆ టైంలో బాధితుడిని పరామర్శించాడని, హూప్ క్రియేట్ చేశాడన్నాడు. కట్ చేస్తే పెరిగిన కలెక్షన్స్ తో ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది… ఏం నజీబ్ అని అలా తేల్చాడు.

ఇక పుష్ఫ 3 వస్తే, అది రెక్లెస్ రిటర్న్ అని క్యాప్షన్ పెట్టాలంటూ మూడో ట్వీట్ ఇచ్చాడు. గ్లోబల్ స్టార్ ఎప్పుడైనా కావొచ్చు, కాని ముందు డ్యామేజ్ కంట్రోల్ ముఖ్యమన్నాడు. కట్ చేస్తే ఇదంతా టీవీ 9 తో కలిసి ఆహా టీం జర్నీ చేస్తోంది… అలా వాళ్ల మీద కోపం అల్లు అరవింద్, అల్లు అర్జున్ మీద రవిప్రకాశ్ చూపిస్తున్నాడన్నారు. అదేం లేదని తేల్చటమే కాదు, ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదనే మీనింగ్ వచ్చేలా బన్నీ మీద సెటైర్ వేశాడన్నారు.

ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో 24 గంటల న్యూస్ చానెల్ ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి ఇలా వరుసగా ట్వీట్ల దాడి చేస్తుండటంతో, పుష్ప2 దొంగలెక్కలే అన్న అభిప్రాయం మరింత బలపడుతోంది. బేసిగ్గా ఇలాంటి దొంగ కలెక్షన్స్ తో పండగ చేసుకుంటారు. కార్పోరేట్ బుక్కింగ్స్ తో లేని వసూల్ల లెక్కలు చెబుతుంటారు. ఇప్పుడు హీరో గొప్పతనం కోసం అలాంటి దిక్కుమాలిన పని సౌత్ లో కూడా మొదలు పెడితే, టాలీవుడ్ కూడా మరో బాలీవుడ్ లా మారి, కుప్పకూలే ఛాన్స్ ఉంది. ఇలాంటి టైంలో ప్రొడ్యూసర్ నట్టి కుమార్ అయితే, నార్త్ ఇండియాలో తప్పా, సౌత్ లోనే కాదు, యూఎస్ లోకూడా పుష్ప2 మూవీ కి బ్రేక్ ఈవెన్ రాలేదన్నాడు. అంటే ఈ సినిమా రైట్స్ ఎంత పెట్టి కొన్నారో, అంత వసూళ్ కాలేదనే అర్ధమపోతోంది. అలాంటప్పుడు 1850 కోట్ల వసూల్ల ని నమ్మేదెవరు?