దిస్ ఈజ్ 2 మచ్… ఎన్టీఆర్ 23వ స్థానమా… నమ్మేలా ఉందా.?

రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా కింగ్... అలాంటి తన చైర్ కే ఎసరు పెడుతూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దూసుకెళుతున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దర్ని కాదని ఇండియా నెంబర్ 1 అల్లు అర్జున్ అంటున్నారు. ఇదేదో అల్లు ఆర్మీనో మరొకరో అంటే అతి అనుకోవాచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 1, 2025 | 07:02 PMLast Updated on: Feb 01, 2025 | 7:02 PM

This Is 2 Much Ntr Is 23rd Is It Believable

రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే పాన్ ఇండియా కింగ్… అలాంటి తన చైర్ కే ఎసరు పెడుతూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దూసుకెళుతున్నాడు. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దర్ని కాదని ఇండియా నెంబర్ 1 అల్లు అర్జున్ అంటున్నారు. ఇదేదో అల్లు ఆర్మీనో మరొకరో అంటే అతి అనుకోవాచ్చు. కాని ఇంటర్నెట్ మూవీ డాటా బేస్ ఈ లిస్ట్ ఇచ్చింది. అయినా ఏ విషయాలను బేస్ చేసుకుని ఐఎమ్ డీబీ లో బన్నీని నెంబర్ వన్ అని తేల్చారు. ఎందుకంటే బన్నీకి ఇప్పుడొచ్చిన పుష్ప2 కంటే సాలిడ్ హిట్ పదేళ్ల క్రితం ప్రభాస్ కి వచ్చింది. 5 పాన్ ఇండియా హిట్ల రికార్డు తనకుంది. ఇక రాజమౌలి సెంటిమెంట్ ని బ్రేక్ చేసి, దేవరతో హిట్ కొట్టిన ఎన్టీఆర్ కి దేశవ్యాప్తంగా ఊరమాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరి పేర్లు టాప్ ఫైలో లేవు.. టాప్ టెన్ లో ఎన్టీఆర్ పేరు లేదు. టాప్ ట్వంటీ లిస్ట్ లో కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ పేరులేదు… అంటే ఇవి కూడా ఫేకని తెలుస్తోందా..? మరీ ఘోరంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుని చివర్లో 25వ స్తానంలో ఉంచారు.. ఇది మరీ టూటూ మచ్… దీని వెనకున్న మతలబేంటో చూసేయండి…
ఐ ఎమ్ డీ బీ అంటే, ఇంటర్నెట్ లో మూవీలకు సంబంధించిన డాటా బేస్.. ఇందులో నటులు, టెక్నీషియన్స్, డైరెక్టర్లు, రైటర్లు, ప్రొడ్యూసర్లు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అన్ని సినీరంగాలకు చెందిని ఇన్ ఫర్ మేషన్ ఉంటుంది. ఓరకంగా సినిమాల డిటేల్స్ అన్నీ ఉండే వికీపీడియాలాంటిది… అలాంటి ఈ సంస్థ ఓ లిస్ట్ ఇస్తే ఖచ్చితంగా అది నమ్మేతీరాలి.. కాని ఇండియా టాప్ 25 హీరోల గురించి ఐఎమ్ డీబీ ఇచ్చిన లిస్టే కామెడీగా ఉంది.

సినిమాల పరంగా,మార్కెట్ పరంగా, లేదంటే జనాల్లో క్రేజే, హిట్లతో వచ్చిన మైలేజ్ పరంగా ఇండియా టాప్ 25 హీరోలెవలో లిస్ట్ వచ్చేసింది. అందులో ఇండియా నెంబర్ 1 ఐకాన్ స్టార్ అల్లు అర్జునన్నారు. నెంబర్ 2 ప్లేస్ లో కింగ్ ఖాన్ షారుక్ కని తేల్చారు. మూడో స్థానం యష్ ని, నాలుగో స్థానంలో రణ్ బీనర్ కపూర్ ని ఉంచారు. ఐదో స్తానంలో అసలు ఎవరో తెలియని బెంగాలి నటుడు దేవ్ ని పెట్టారు. ఇదే విచిత్రం…

ఎందుకంటే రెండు సార్లు 1000 కోట్లు కొల్లగొట్టిన షారుఖ్ 2 స్థానంలో ఉంటే, ఒకేసారి వెయ్యికోట్ల క్లబ్ లో అడుగు పెట్టిన బన్నీ మొదటి స్థానంలో ఉన్నాడట. ఐదు పాన్ ఇండియా హిట్లతో పాన్ ఇండియా కింగ్ అనిపించుకున్న రెబల్ స్టార్ ఎక్కడో టాప్ 7 ప్లేస్ లో ఉంటే, చరణ్ 8వ స్థానంలో ఉన్నాడట. నిజానికి రామ్ చరన్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య, గేమ్ ఛేంజర్ రెండీంటితో ఫ్లాప్స్ ఫేస్ చేశాడు.. అలాంటి తను టాప్ 10 లో ఎనిమిదో స్థానంలోఉంటే, ఎన్టీఆర్ మాత్రం టాప్ 20 లో కూడా లేడు.

ఎక్కడో టాప్ 25 హీరోస్ లిస్ట్ లో 23 వ స్థానంలో ఉన్నాడు. అదే కామెడీగా ఉంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుకి పాన్ ఇండియా హిట్ రాకున్నా, తనకున్న గుర్తింపువేరు…అలాంటి తనని టాప్ 25 లో చివరి స్థానంలో ఉంచారు… సూపర్ స్టార్ రజినీకాంత్ ది 11 వ స్తానమట.. ఈ నెంబర్సే సిల్లీగా ఉన్నాయంటున్నారు. ఇమేజ్ లో మార్కెట్ లో, వసూల్ల పరంగా, ఇలా ఏ యాంగిల్ లో చూసినా బన్నీకంటే, ప్రభాస్, ఎన్టీఆర్,షారుఖ్ కాన్, యష్ టాప్ ప్లేస్ లో ఉన్నారు.

అయినా బన్నీనే ఇండియా నెంబర్ 1 అంటే నమ్మేలా లేదు. అందుకే మరో లిస్ట్ ని రిలీజ్ చేసినట్టుంది ఐఎమ్ డీబీ. ఇందులో భారీ కలెక్సన్స్ పరంగా సినిమాలను, అందులో నటించిన స్టార్స్ ని డివైడ్ చేశారు. ఆలిస్ట్ లో 1855 కోట్ల కలెక్షన్స్ తో పుష్పరాజ్ గా బన్నీ నెంబర్ 1. 1850 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్… ఇలా ఓ లిస్ట్ వచ్చింది. అంతా బానే ఉంది కాని, కలెక్షన్స్ పరంగా చూస్తే 2 వేల కోట్ల దంగలే ఫస్ట్ కాబట్టి ఆమిర్ ఖాన్ నెంబర్ వన్ అవ్వాలి… అలా జరగలేదు… అందుకే ఇది కూడా ఇష్టమైన వాళ్లు ఓట్లేస్తే వచ్చే జనరల్ సర్వేలాంటిదే అనంటున్నారు. అల్లు ఆర్మీ మ్యానిపులేషనే తప్ప మరొకటి కాదని మిగతా స్టార్స్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.