పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇది.. పాపం ఎలా తట్టుకుంటారో ఏంటో..?

పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే వైకుంఠపాళీ ఆటలాంటిది. డేట్స్ ఇచ్చి ఎప్పుడు నిచ్చెన ఇప్పిస్తాడో తెలియదు.. ఇవ్వకుండా ఎప్పుడు పాము నోట్లో తోస్తాడో అర్థం కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2025 | 04:20 PMLast Updated on: Mar 24, 2025 | 4:20 PM

This Is A Big Shock For Pawan Kalyan Fans How Will They Cope With This

పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే వైకుంఠపాళీ ఆటలాంటిది. డేట్స్ ఇచ్చి ఎప్పుడు నిచ్చెన ఇప్పిస్తాడో తెలియదు.. ఇవ్వకుండా ఎప్పుడు పాము నోట్లో తోస్తాడో అర్థం కాదు. అలా మన ఆట ఆడుతూ వెళ్ళిపోవాలి అంతే. అదృష్టం బాగున్నప్పుడు నిచ్చెన వస్తుంది.. దాన్ని పట్టుకుని జాగ్రత్తగా పాము నోట్లో పడకుండా అలా పైకెళ్ళిపోవాలి. అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్స్ జాగ్రత్తగా వాడుకోవాలి అన్నమాట. అలా గత రెండు మూడు సంవత్సరాలలో భీమ్లా నాయక్, వకీల్ సాబ్, బ్రో లాంటి సినిమాలకు ఈ ఫార్ములా వర్కౌట్ అయింది. వాటికంటే ముందు మొదలైన హరి హర వీరమల్లు, ఓజీ లాంటి సినిమాలు మాత్రం ఇంకా అలాగే ఉండిపోయాయి. ఈ సినిమాలు కూడా త్వరలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇదంతా బాగానే ఉంది కానీ తాజాగా పవన్ ఫ్యాన్స్ కు ఊహించని షాక్స్ తగిలాయి.

ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయలేక నానా తంటాలు పడుతున్నాడు పవన్. ఇలాంటి సమయంలో ఆయన నుంచి కొత్త సినిమాలు ఊహించడం అనేది అత్యాశే. కానీ ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలను ఎలాగైనా పూర్తి చేస్తాను అని చెప్పాడు పవర్ స్టార్. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే కేవలం సెట్స్ మీద ఉన్న సినిమాలు మాత్రమే పూర్తయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక కమిట్ అయిన సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందులో ముందుగా బలైపోయే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ కాంబినేషన్ అంటూ రెండు సంవత్సరాల కింద ఈ సినిమాను హడావిడిగా మొదలుపెట్టారు. హరీష్ శంకర్ కూడా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది.. పవన్ డేట్స్ ఇస్తే మూడు నెలల్లో సినిమా తీస్తా అని చెప్పాడు. కానీ ఆ మధ్య పవన్ మాత్రం తను డేట్స్ ఇచ్చే టైంకు హరీష్ కథ సిద్ధం చేయలేదని చెప్పాడు. దాంతో అప్పటినుంచి ఉస్తాద్ అలాగే ఆగిపోయింది.. ఇక ఇప్పుడు సినిమా పూర్తిగా ఆగిపోయింది. ఇకపై పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా ఉండకపోవచ్చు. ఈ సినిమాను పూర్తిగా ఆపేద్దామని జనసేనాని చెప్పేసినట్టు ప్రచారం జరుగుతుంది.

అందుకే హరీష్ శంకర్ ప్రస్తుతం బాలకృష్ణ కోసం కథ రాస్తున్నాడు. అక్కడ బాలయ్య అఖండ సీక్వెల్ పూర్తిచేసే లోపు ఇక్కడ ఆయన కోసం కథ సిద్ధం చేయాలని ఫిక్స్ అయిపోయాడు హరీష్. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ కాంబినేషన్లో సినిమా నిర్మించబోతుంది. అలాగే సురేందర్ రెడ్డితో అనుకున్న సినిమా కూడా ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తానని చెప్పాడు. అప్పట్లో ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఈ లెక్కన పవన్ ఫ్యాన్స్ కు ఒకటి కాదు వరుసగా రెండు షాకింగ్ న్యూస్ లు అన్నమాట. ఆల్రెడీ హరీష్ శంకర్ సినిమా ఆగిపోయింది అని ఫిక్స్ అయిపోయిన ఫాన్స్ కు.. తాజాగా సురేందర్ రెడ్డి సినిమా విషయం కూడా షాకే. ఈ లెక్కన కేవలం వీరమల్లు, ఓజీ మాత్రమే పవన్ చేతిలో ఉన్నాయి. ఇది మినహాయిస్తే పవన్ కొత్త సినిమాలు ఏమీ చేయడు.. చేసే ఉద్దేశం కూడా లేదు.. అంతకుమించి ఆయన దగ్గర సమయం కూడా లేదు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కెరీర్ ఓజి సినిమాతో ఎండ్ అయ్యేలా కనిపిస్తోంది. అన్ని కుదిరితే సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.