ఇది భీభత్సమైన ఐడియా… డ్రాగన్ ఆఫ్ మాసెసే…!

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ చేస్తున్న డ్రాగన్ లో హీరోలు ఇద్దరనే ది ఆల్ మోస్ట్ తేలిపోయింది. నెలరోజులుగా ఇందులో కూడా ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ వేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2025 | 08:00 PMLast Updated on: Mar 06, 2025 | 8:00 PM

This Is A Terrifying Idea Dragon Of Massese

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ చేస్తున్న డ్రాగన్ లో హీరోలు ఇద్దరనే ది ఆల్ మోస్ట్ తేలిపోయింది. నెలరోజులుగా ఇందులో కూడా ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ వేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎన్నడూ కూడా ప్రశాంత్ నీల్ కాని మైత్రీ మూవీ మేకర్స్ కాని ఈ ప్రచారాన్ని ఖండించలేదు. అలాని సపోర్ట్ కూడా చేయలేదు. ఐతే ఇప్పుడు ఇంకో మ్యాటర్ షాకింగ్ గా మారింది. అదే డ్రాగన్ ఒక సినిమా కాదని. ఒకే కథ కానే కాదని… రెండు కథల్ని కలిపితేనే ఈ డ్రాగన్ బయటికొస్తుందట. అంటే డ్రాగన్ కూడా బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ స్టైల్లో రాబోతోందా? ఈ డౌట్ వందకు వందశాతం నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే డ్రాగన్ పేరుతో టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోకూడా రెండు టైటిల్స్ రిజిస్టర్ అయినట్టు తెలుస్తున్నాయి. ఆ రెండు పేర్లని బట్టి చూస్తే డ్రాగన్ కూడా రెండు భాగాలుగా వస్తోందా అన్న అనుమానం పెరుగుతోంది. ఇంతకి డ్రాగన్ పేరుతో రిజిస్టరైనా ఆ రెండు పేర్లేంటి? వాటితో అలా ఎలా ఇది రెండు భాగాల సినిమా అని కన్ క్లూజన్ కి వస్తున్నారంతా…? టేకేలుక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హిందీ మూవీ వార్ 2 సాంగ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సెట్లో నువ్వా నేనా అన్నట్టు హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య డాన్స్ వార్ జరుగుతోంది. ఆ పాట సండేలోగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాతే తారక్ ఫ్రీ అయ్యే ఛాన్స్ఉంది. ఈమంథ్ ఎండ్ లోగా డ్రాగన్ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే మొన్నటి వరకు జరిగిన ప్రచారం ప్రకారంచూస్తే డ్రాగన్ లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ వేస్తున్నాడనేది నిజమని తేలింది. కాకపోతే అందులో పెద్దగా సర్ ప్రైజ్ ఏం లేదు. అసలు సర్ ప్రైజ్ ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుండటమే…ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే ఇన్ స్టాల్ మెంట్ పద్దతిలో ఒకటి తర్వాత మరో మూవీ రావాల్సిందే.

కేజీయఫ్ కూడా రెండు భాగాలుగా వచ్చింది. తర్వాత రెబల్ స్టార్ తో తను తీసిన సలార్ కూడా రెండు భాగాలుగా మార్చాల్సి వచ్చింది. ఒకటి రిలీజై 800 కోట్లు రాబడితే, రెండో భాగం డ్రాగన్ షూటింగ్ తర్వాత మొదలయ్యేలా కనిపిస్తోంది. అదయ్యాక కేజీయఫ్ 3 తీయాలనుకుంటున్న ప్రశాంత్ నీల్, డ్రాగన్ విషయంలో ఎలాంటి లేటు లేకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు.అంటే డ్రాగన్ ఇప్పుడు తీస్తున్న ప్రశాంత్ నీల్, ఒకేసారి డ్రాగన్ మొదటి భాగం రెండు భాగం తీస్తాడట. రెండో భాగం పోస్ట్ ప్రొడక్షన పనులు చేస్తూనే ప్యార్ లల్ గా సలార్ 2 ప్లాన్ చేస్తాడట. సో ఇది ముందే నిర్ణయించుకున్నారు కాబట్టే, ఈ మూవీ రెండు భాగాలకు టైటిల్లు రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది.

డ్రాగన్ మొదటి భాగానికి డ్రాగన్ ఫైర్, రెండో భాగానికి డ్రాగన్ అండర్ డిస్ స్ట్రక్షన్…ఇలా రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుందని గట్టిగా ప్రచారం జరగటానికి రెండు కారణాలు. ఒకటి టాలీవుడ్ లో ఈ రెండు టైటిల్లు రిజిస్టర్ అయ్యాయి. ఇవే టైటిల్లు బాలీవుడ్ లో కూడా రిజిస్టర్ అవటంతో, ఎన్టీఆర్ మూవీనే ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తీస్తున్నాడని ఆన్ అఫీషియల్ గా కన్ఫామ్ అయిపోతోంది.