Anusuya vijay : విజయ్ బూతుపై అనసూయ స్పందన ఇదే..
తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మధ్య.. అర్జున్ రెడ్డి సినిమా నుంచి తెలియని గ్యాప్ క్రియేట్ అయ్యిందన్న విషయం తెలిసిందే..
తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మధ్య.. అర్జున్ రెడ్డి సినిమా నుంచి తెలియని గ్యాప్ క్రియేట్ అయ్యిందన్న విషయం తెలిసిందే.. వీళ్ల ఫ్యాన్స్ కూడా రెండు సోషల్ మీడియాల్లో రెండు వర్గాలుగా చీలిపోయి మాటల యుద్ధం జరుపుకుంటూనే ఉంటారు. అయితే ఆ మధ్యన అనసూయ సడన్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో ఇక వివాదాలు చేయనని, ఫుల్‌స్టాప్ పెట్టేస్తానని చెప్పేసింది. సీన్ కట్ చేస్తే.. రీసెంట్‌గా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ మరోసారి బూతు పదం ప్రయోగించాడు. దీంతో మరోసారి అనసూయ టాపిక్ తెరపైకి వచ్చింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇంతకీ విషయం ఏమిటంటే.. రీసెంట్‌గా తన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ల కోసం రౌడీ హీరో విజయ్ దేవర కొండ బిజీ బిజీగా తిరిగాడు. అలవాటు ప్రకారం ఆ ప్రమోషన్లలో నోరు జారాడు.. బూతు పదాన్ని ప్రయోగించాడు. అలా ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ వాడిన బూతు పదంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రౌడీ హీరోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు వాగడం, ఆ తర్వాత తెలంగాణ హీరో మీద విషం చిమ్ముతున్నారంటూ పీఆర్ మాఫియాతో సింపథీ డ్రామాలు ఆడడం, మళ్లీ అందులోకి అసనూయను లాగడం.. విజయ్ దేవరకొండకు బాగా అలవాటైపోయిందంటూ.. ఓ నెటిజన్ కాస్త ఘాటుగానే కామెంట్ చేశాడు.
ఈ కామెంట్‌పై అనసూయ స్పందించింది. ఎవరు ఏ మాఫియా చేస్తున్నారో నేను చాలా సార్లు చెప్పి వదిలేశా.. ఈ ట్వీట్‌ను కూడా ఇప్పుడు వారు వారి స్వార్థానికే వాడుకుంటారు అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ఇష్యూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కొన్నాళ్లుగా సద్దు మణిగింది అనుకున్న వివాదం మళ్లీ చెలరేగిందా అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. చూడాల మరి. ఈ విషయానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందో లేక ఇంకేమైనా మలుపు తిరుగుతుందా అన్నది.