కీర్తి సురేశ్ పెళ్లి శుభలేఖ ఇదే, గ్రాండ్ ప్లానింగ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. దాదాపు 20 రోజుల నుంచి కీర్తి సురేష్ మ్యారేజ్ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దీనిపై అనేక వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2024 | 05:39 PMLast Updated on: Dec 05, 2024 | 5:39 PM

This Is Keerthy Sureshs Wedding Auspicious Letter Grand Planning

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. దాదాపు 20 రోజుల నుంచి కీర్తి సురేష్ మ్యారేజ్ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దీనిపై అనేక వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక కీర్తి సురేష్ గోవాలో పెళ్లి చేసుకోవాలి అనుకోవడం… తన చిన్ననాటి స్నేహితుడు అలాగే తన ప్రియుడు యాంటోనీతో ఆమె ప్రేమలో ఉన్న విషయం ఇప్పటివరకు కనీసం చిన్న లీక్ కూడా రాకపోవడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

ఈ రోజుల్లో హీరోయిన్లు ఎవరితో అయినా డేటింగ్ చేస్తే ఆ విషయాన్ని కచ్చితంగా సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో బయట పెట్టడం లేకపోతే ఎక్కడైనా ఫోటోలకు దొరికిపోవడం వంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ కీర్తి సురేష్ మాత్రం ఇప్పటివరకు అసలు మీడియాకు కూడా దొరకలేదు. వీళ్ళిద్దరూ దాదాపు 15 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న సరే దానికి సంబంధించి ఈ చిన్న న్యూస్ కూడా బయటకు రాలేదు. పెళ్లి చేసుకుంటుంది అనే న్యూస్ మాత్రమే ఇప్పటివరకు వాళ్ళిద్దరి గురించి బయటకు వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ పెళ్లిని హిందూ క్రిస్టియన్ సాంప్రదాయంలో గోవాలో జరపనున్నారని… ఒక ప్రముఖ చర్చిలో వివాహం జరుగుతుందని అలాగే ఒక ప్రత్యేకమైన సెట్ లో వీరు వివాహం చేసుకోబోతున్నారు అంటూ తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన శుభలేఖ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిసెంబర్ 12వ తారీకున వీళ్లిద్దరూ వివాహం చేసుకోనున్నారు. దీనికి అతి తక్కువ మంది అతిథులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. మన తెలుగు నుంచి నాచురల్ స్టార్ నాని, అలాగే దగ్గుబాటి రానా వంటి అతి తక్కువ మంది మాత్రమే హాజరవుతున్నారు.

అటు తమిళ సినిమా నుంచి కూడా కొంతమంది మాత్రమే హాజరవుతున్నట్లుగా టాక్. కీర్తి తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ను మాత్రమె ఆహ్వానిస్తోంది. ఆమెకు కాబోయే భర్త వ్యాపారవేత్త కావడంతో వ్యాపార ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరవుతున్నారట. ఈ వివాహం కచ్చితంగా స్పెషల్ గా ఉండనుందట. దీనితో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అవుతున్నారని కూడా అంటున్నారు. ఇటీవల కీర్తి సురేష్ తిరుమల కూడా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఆంటోనీ క్రిస్టియన్ కావడంతో క్రిస్టియన్ సాంప్రదాయంలో కూడా ఈ వివాహం జరపాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కీర్తి సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది. ప్రస్తుతం చేసే సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల గురించి ఆలోచిస్తుందని టాక్. గత కొన్నాళ్ళుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోంది కీర్తి.