ఇదీ ఎన్టీఆర్ కన్నడ రేంజ్… ఓజీ’ని బీట్ చేసేసాడు…

టాలీవుడ్ లో గాని తమిళంలో గాని ఏ స్టార్ హీరోకు లేని మార్కెట్ కన్నడలో ఎన్టీఆర్ సొంతం అవుతుంది. అక్కడి జనాలు ఎన్టీఆర్ ను ఓన్ చేసుకున్న విధానం చూసి ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2024 | 12:39 PMLast Updated on: Nov 26, 2024 | 12:39 PM

This Is Ntrs Kannada Range He Beat Og

టాలీవుడ్ లో గాని తమిళంలో గాని ఏ స్టార్ హీరోకు లేని మార్కెట్ కన్నడలో ఎన్టీఆర్ సొంతం అవుతుంది. అక్కడి జనాలు ఎన్టీఆర్ ను ఓన్ చేసుకున్న విధానం చూసి ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. ఎన్టీఆర్ కన్నడ మాట్లాడే విధానం, దేవర సినిమా రిలీజ్ కు ముందు అక్కడి స్టార్ హీరో రిషబ్ శెట్టితో కలిసి దేవాలయాలు తిరగడం… తన తల్లి పుట్టిన ప్రాంతానికి ఎన్టీఆర్ విలువ ఇవ్వడం… అన్నీ కూడా అక్కడి జనాలకు బాగా నచ్చాయి. గతంలో ఏ తెలుగు హీరో కూడా కన్నడకు ఈ స్థాయిలో వాల్యూ ఇవ్వలేదనే ఫీల్ లో ఉన్నారు.

రజనీ కాంత్ పుట్టింది కర్నాటకలో అయినా… తమిళనాడులో సూపర్ స్టార్ అయ్యారు. తర్వాత కన్నడను లైట్ తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ తల్లిది కర్ణాటక అయినా… ఎన్టీఆర్ మాత్రం కన్నడను లైట్ తీసుకోలేదు. గతంలో అక్కడి స్టార్ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ తో ఎన్టీఆర్ స్నేహం బాగా పాపులర్ అయింది. అతని కోసం ఓ పాట కూడా పాడాడు ఎన్టీఆర్. ఇక రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతారా సీరీస్ లో ఎన్టీఆర్ కు ఓ కీ రోల్ కూడా ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అనౌన్స్ మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని టాక్.

ఇక దేవర సినిమా టికెట్స్ ను బ్లాక్ లో 3000 లకు కూడా కన్నడలో కొన్నారు అంటే ఏ రేంజ్ లో ఎన్టీఆర్ కు మార్కెట్ క్రియేట్ అయిందో అర్ధం చేసుకోవచ్చు. బెంగళూరులోనే గతంలో మార్కెట్ ఉండేది. ఇప్పుడు మాత్రం స్టేట్ వైడ్ గా పెరుగుతోంది. అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాలో ఎన్టీఆర్… కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కు ఓ మంచి రోల్ ఇస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే హీరోయిన్ గా కూడా రుక్మిణీ వసంత్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. జనవరి లేదా ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ కానుంది.

ఈ టైం లో బయటకు వచ్చిన ఓ న్యూస్… కన్నడలో ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రూవ్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కన్నడ రైట్స్ ను కేవలం 12 కోట్లకు కొంటే… దేవర సినిమా రైట్స్ ను 18 కోట్లకు కొన్నారు. ఆరు కోట్లు ఎక్కువగా ఎన్టీఆర్ సినిమాను కొన్నారు అక్కడి నిర్మాతలు. దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. మెగా హీరోలు… ఎన్టీఆర్ ను కన్నడలో బీట్ చేయడం అంత ఈజీ కాదు. రాబోయే మెగా హీరోల సినిమాలు ఎన్టీఆర్ ను టార్గెట్ చేసినా అది పెద్దగా సక్సెస్ అయ్యే సీన్ కనపడటం లేదు.