సుబ్బరాజు వైఫ్ బ్యాక్ గ్రౌండ్ ఇదే, సుబ్బుకు గ్రీన్ కార్డ్
మన టాలీవుడ్ లో స్టార్ నటులు ఒక్కొక్కరిగా పెళ్ళిళ్ళు కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. సినిమాలతో బిజీగా ఉంటూనే పెళ్ళిళ్ళు చేసుకుంటూ లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నారు.
మన టాలీవుడ్ లో స్టార్ నటులు ఒక్కొక్కరిగా పెళ్ళిళ్ళు కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. సినిమాలతో బిజీగా ఉంటూనే పెళ్ళిళ్ళు చేసుకుంటూ లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నారు. పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదని చెప్పిన వాళ్ళు కూడా లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలుతూ పెళ్లి చేసుకుంటున్నారు. గత రెండు నెలల నుంచి టాలీవుడ్ లో మొత్తం పెళ్లి సందడి నడుస్తోంది. యువ హీరో కిరణ్ అబ్బవరం నుంచి ఇది మొదలై… కంటిన్యూ అవుతోంది. త్వరలోనే మూడు నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయి.
ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత పెళ్లి, కీర్తి సురేశ్, ఆంటోని పెళ్లి… అఖిల్, జైనాబ్ పెళ్ళిళ్ళు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఈ పెళ్ళిళ్ళు. ఈ టైంలో సీనియర్ యాక్టర్ సుబ్బరాజు పెళ్లి చేసుకున్నాడు. 47 ఏళ్ళ వయసులో తన క్లోజ్ ఫ్రెండ్ ను సుబ్బరాజు పెళ్లి చేసుకున్నాడు. భీమవరంలో పుట్టిన ఈ కంప్యూటర్ మెకానిక్… అసలు ఏ మాత్రం హడావుడి లేకుండా… అసలు పెళ్లి చేసుకోను అని చెప్పి పెళ్లి చేసుకుని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం చూసి అందరూ షాక్ అయ్యారు.
ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సుబ్బరాజు వైఫ్ ఎవరూ అంటూ సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు జనాలు. ఆమె హీరోయిన్ రేంజ్ లో ఉందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక సుబ్బరాజు భార్య పేరు స్రవంతి కాగా… ఆమె ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడాలో నార్త్వుడ్ డెంటల్ సెంటర్స్‌లో డెంటిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. కొలంబియా యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీల నుండి ఆమె BDS, DDS, MPH డిగ్రీలు పొంది… ఇప్పుడు డాక్టర్ గా వర్క్ చేస్తున్నారు. స్రవంతి ఫిట్నెస్ ఫ్రీక్ అని టాక్.
సైన్స్ అంటే విపరీతమైన ఆసక్తి ఉన్న ఆమె… ఉన్నత చదువులు చదివింది. హైదరాబాద్ కు చెందిన స్రవంతి ఫ్యామిలీ ఎప్పుడో… 90ల్లోన్నే అమెరికా వెళ్ళిపోయారు. స్రవంతి ఫ్యామిలీ అమెరికాలో ఫ్లోరిడాలో స్థిరపడి అక్కడే ఉంటున్నారు. ఆమె అమెరికన్ సిటిజన్ అని టాక్. అందుకే పెళ్లి అమెరికాలోనే గ్రాండ్ గా చేసుకున్నారు. ఈ పెళ్లి రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లోనే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సుబ్బరాజుకు ఆఫర్లు తగ్గడంతో పర్సనల్ లైఫ్ పై ఫోకస్ చేసాడు. మరి ఈ పెళ్ల్లి తర్వాత సుబ్బరాజు అమెరికాలోనే ఉంటాడా… లేదంటే సినిమాలు చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. గ్రీన్ కార్డ్ తీసుకుంటాడని టాక్.