Mahesh-Rajamouli : ఏకంగా 20 లక్షలా…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి బయటికి రాగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

This movie will be made in the Hollywood range with a huge budget of around one thousand crores.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి బయటికి రాగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరగా గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అవుతున్నాడు. ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. హాలీవుడ్ రేంజ్‌లో దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ కేఎల్ నారాయణ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన రాజమౌళి.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. అయితే.. లేటెస్ట్‌గా ఈ సినిమా షూటింగ్ కోసం ఏకంగా 20 లక్షల వంట సామాగ్రి కొనుగోలు చేసినట్లుగా ఒక న్యూస్ బయటికొచ్చింది.
మామాలునేగా రాజమౌళి సినిమా అంటే భారీ సెటప్ ఉంటుంది. షూటింగ్ స్టార్ట్ చేయడమే మేకర్స్ చేతుల్లో ఉంటుంది కానీ, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎన్ని రోజులు రోజులు పడుతుంది? అనేది ఎవరూ చెప్పలేరు. అందుకే.. వంట సామాగ్రిని అద్దెకు తీసుకురావడం కంటే.. కొనుగోలు చేస్తేనే బెటర్ అని నిర్మాత కేఎల్ నారాయణ భావించారట. దాంతో రంగంలోకి దిగిన ప్రొడక్షన్ టీం 20 లక్షలు ఖర్చు చేసి వంట సామాగ్రిని కొనుగోలు చేసినట్లుగా టాక్. అయితే.. జస్ట్ దీనికే 20 లక్షల ఖర్చు అంటే.. సినిమా షూటింగ్ ఎన్ని రోజులు పడుతుందో అర్థం చేసుకోవచ్చు..
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు వరకు సెట్ వర్క్ కూడా పూర్తి కానుందట. అలాగే నటీనటుల ఎంపిక పక్రియ కూడా పూర్తి అవ్వబోతుందట. దాంతో సెప్టెంబర్‌లో ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.