republic day releasing : రిపబ్లిక్ డే కి డబ్బింగ్ సినిమాల హవా..
టాలీవుడ్(Tollywood)లో పండగ సినిమాల సందడి ముగిసింది. సంక్రాంతి(Sankranti)కి టాప్ హీరోల సినిమాలతోపాటు హనుమాన్ (Hanuman) వంటి చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధించి ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంది.

This year, heavily dubbed movies for Republic Day are Kottywood and Bollywood movies
టాలీవుడ్(Tollywood)లో పండగ సినిమాల సందడి ముగిసింది. సంక్రాంతి(Sankranti)కి టాప్ హీరోల సినిమాలతోపాటు హనుమాన్ (Hanuman) వంటి చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధించి ఈ పండగను సెలబ్రేట్ చేసుకుంది. ఇప్పుడు సినిమా లవర్స్ దృష్టి రిపబ్లిక్ డే (Republic Day)కి రిలీజ్ అయ్యే సినిమాలపై పడింది. తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు (Dubbed movies) థియేటర్లలో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాయి.
హృతిక్ రోషన్(Hrithik Roshan), దీపికా పదుకొనే(Deepika Padukone) హీరోహీరోయిన్లుగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పైటర్’. ఎయిర్‌పోర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమా జనవరి 25న విడుదల కాబోతోంది. ఎప్పటికప్పుడు ఆడియన్స్ పల్స్‌ను పసిగట్టి దాన్ని బట్టే సినిమాలు చేసుకుంటూ వెళ్ళే మోహన్‌లాల్ ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లిజో జోస్ పెలిసెరీ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ మూవీ ‘మలైకోలై వాలిబన్’ జనవరి 25న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో మోహన్‌లాల్ రెజ్లర్‌గా నటించాడు. ధనుష్ హీరోగా అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కెప్టెన్ మిల్లర్’. ప్రియాంక మోహనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ్‌లో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తెలుగులో కూడా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సింది. కానీ, తెలుగు హీరోల సినిమాలు రిలీజ్ ఉండడంతో జనవరి 25న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
శివ కార్తికేయన్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘అయలాన్’. సంక్రాంతికి తమిళంలో సందడి చేసిన చిత్రమిది. ఆర్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా తెలుగులో సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా, తెలుగు సినిమాల కారణంగా జనవరి 26కి వాయిదా వేశారు. ఇక హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన ‘105 మినిట్స్’ చిత్రం కూడా జనవరి 26నే రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఒకే ఒక్క పాత్రతో రూపొందడం విశేషం. వీటితోపాటు ‘మూడో కన్ను’, ‘బిఫోర్ మ్యారేజ్’ వంటి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి రిపబ్లిక్ డే కి సినీ జాతర మాములుగా ఉండదని తెలుస్తోంది.