ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ.. వీళ్ల హీరోయిన్ల మీదే పాన్ ఇండియా క్రష్…
పాన్ ఇండియా లెవల్లో రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేదంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్... వీల్లతో ఎవరు జోడీ కడితే వాళ్లే పాన్ ఇండియా హీరోయిన్... ఒకప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అంటే బాలీవుడ్ లేడీనే... వాళ్ల పేర్లు సౌత్ జనాలకు తెలిసినా తెలియకున్నా,
పాన్ ఇండియా లెవల్లో రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేదంటే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… వీల్లతో ఎవరు జోడీ కడితే వాళ్లే పాన్ ఇండియా హీరోయిన్… ఒకప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అంటే బాలీవుడ్ లేడీనే… వాళ్ల పేర్లు సౌత్ జనాలకు తెలిసినా తెలియకున్నా, సౌత్ లో ఎంత గొప్ప గ్లామర్ క్వీన్ ఉన్నా… ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అంతే బాలీవుడ్ ముద్దుగుమ్మే. కాని రోజులు మారాయి. టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ ని ఏలుతున్నారు. ఇప్పుడు హిందీ హీరోలు కాదు, తెలుగు హీరోల పక్కన మెరిసే లేడీకే పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపే ఛాన్స్ దొరుకుతోంది.. హిందీ మూవీ స్త్రీ 2 కి 800 కోట్లొచ్చినా, శ్రద్దా కపూప్ ఈ ఏడాది టాప్ హీరోయిన్ అనిపించులేకపోయింది. కాని ఇండియా నెంబర్ వన్ పొజీషన్ కోసం బాలీవుడ్ హీరోయిన్లు, పూర్తిగా ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ అండ్ కో మీద ఆధార పడాల్సి వచ్చింది… అంతగా సీన్ మారిపోయింది.
2024 లో పాన్ ఇండియా కింగ్స్ అంటే ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, తేజ వీల్లే.. ఖాన్లు, కపూర్లు, తమిళ్ నాడు సూపర్ స్టార్లు ఇలా ఎవరూ కూడా ఈ ఏడాది సౌండ్ చేసింది లేదు. వసూల్ల రీసౌండ్ వచ్చింది లేదు. కాబట్టే పాన్ ఇండియా హీరోలే కాదు, పాన్ ఇండియా నెంబర్ వన్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ నుంచే మెరవాల్సి వచ్చింది. అలాంటి అద్రుష్టం తెలుగు హీరోల వల్లే వాళ్లకు దక్కింది
ఈ ఏడాది పాన్ ఇండియా లెవల్లో నెంబర్ 2 హీరోయిన్ అంటే పుష్ప 2 హీరోయిన్ రష్మిక పేరే వినిపిస్తోంది. కారణం 1500 కోట్ల పైనే వసూళ్లు రాబట్టడంతో ఈ ఏడాది రష్మికే ఇండియా లోనే టాప్ 2 హీరోయిన్ అంటున్నారు..
నిజానికి పుష్ప2 వసూళ్లే 1500 కోట్లంటున్నారు. అంటే ఈ ఏడాది ఎక్కువ వసూళ్లు రాబట్టింది కూడా ఫుష్ప2నే… అలాంటప్పుడు రష్మికనే ఈ ఏడాది నెంబర్ వన్ హీరోయిన్ అవ్వాలి.. అలాంటిది తను కాకుండా, ఈ ఇయర్ నెంబర్ వన్ హీరోయిన్ గా దీపిక పదుకొనే పేరు మారుమోగుతోంది.
కల్కీలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మెరిసిన తను, ఈ సినిమాతో 1200 కోట్ల వసూళ్లని రుచి చూసింది. అంటే పుష్ప2 కంటే కల్కీ మూవీకి 300 కోట్లు తక్కువే వచ్చాయి. అలా చూసినా రష్మికనే నెంబర్ వన్ హీరోయిన్ అనాలి. కాని కల్కీ లో దీపికా పదుకొనే పాత్రకి ఉన్న ఇంపార్టెన్స్, ఈ సినిమా మార్కెట్ ని తను శాసించిన విధానం పరంగా తానే నెంబర్ వన్ అనిపించుకుంటోంది. అలా రెబల్ స్టార్ క్రేజ్ తనకి ఈ ఏడాది కలిసొచ్చినట్టుంది
ఇక ఈ ఏడాది 800 కోట్ల వసూళ్లు రాబట్టిన స్త్రీ2 మూవీ వల్ల శ్రద్ధా కపూర్ కూడా ఇండియా నెంబర్ వన్ అనిపించుకోవాలి. కాని స్త్రీ 2 మూవీ హిందీ లో తప్ప సౌత్ లో పెద్దగా ఆడలేదు. అలా రిలీజ్ కూడాచేయలేదు. కాబట్టి అసలు శ్రధ్దా కపూర్ ఈ ఏడాది పాన్ ఇండియా టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోనే లేదు.
ఇక దేవర పుణ్యమాని జాన్వీ కపూర్ ఏకంగా పాన్ ఇండియా నెంబర్ 2 హీరోయిన్ గా ఫోకస్ అవుతోంది. 510 నుంచి 670 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన దేవర లో జాన్వీ కపూర్ కనిపించింది, 4 సీన్లలోనే.. కాని ఎన్టీఆర్ క్రేజ్ వల్ల ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీగా రీచ్ అయ్యింది. జాన్వీ పేరు కూడామారుమోగింది. అలా చూస్తే రష్మిక తో సమానంగా ఈ ఏడాది పాన్ ఇండియా నెంబర్ 2 అనిపించుకుంది జాన్వీ కపూర్.