Vijay Dalapathy : విజయ్ సరసన ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్…
తమిళ స్టార్ (Tamil Star) హీరో విజయ్ దళపతి (Vijay Dalapathy) హీరోగా నటిస్తోన్న చిత్రం గోట్.. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

Those two star heroines opposite Vijay...
తమిళ స్టార్ (Tamil Star) హీరో విజయ్ దళపతి (Vijay Dalapathy) హీరోగా నటిస్తోన్న చిత్రం గోట్.. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్, వైభవ్, ప్రేమ్‌జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా.. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ తర్వాత విజయ్ తన 69వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతుండగా.. దీనికి సంబంధించిన ఓ లేటెస్ట్ బజ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి అందరికీ తెలిసిందే.. ఆయన కేవలం తమిళంలోలనే కాకుండా తెలుగులోనూ అనేక మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన చేసే సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఇప్పటి వరకు అలా అనేక సినిమాలు వచ్చి తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పటి వరకు ఆయన మొత్తం 68సినిమాలు చేయగా.. తాజాగా 69వ సినిమా రాబోతుంది. అయితే ఇదే ఆయనకు చివరి సినిమా కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేస్తానని ప్రకటించిన విజయ్.. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తానని ప్రకటించారు. దీంతో.. విజయ్ 69వ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా.. విజయ్ 69వ చిత్రానికి హెచ్ వినో ద్ దర్శకత్వం వహించనున్నారన్న వార్త కూడా ప్రచారం జరుగుతున్నా.. అధికారికంగా ప్రకటించలేదు. అయితే వీరి క్రేజీ కాంబో మూవీని ఏ నిర్మాణ సంస్థ నిర్మించనుందనేది కూడా తెలియాల్సి ఉంది. కాగా.. ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ బజ్ ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ సినిమాలో విజయ్‌తో జతకట్టే హీరోయిన్స్ గురించి ప్రస్తుతం ఒక న్యూస్ కోలీవుడ్ (Kollywood) లో ప్రచారం అవుతోంది. స్టార్ హీరోయిన్స్ సమంత(Samantha), కీర్తీసురేష్ (Keerthy Suresh) ఈ క్రేజీ ప్రాజక్ట్ లో నటించనున్నారని ఓ న్యూస్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. సమంత ఇప్పటికే విజయ్ సరసన కత్తి, తెరి, మెర్సల్ చిత్రాల్లో నటించగా.. కీర్తీ సురేష్ ఇంతకు ముందు భైరవ, సర్కార్ చిత్రాలలో విజయ్‌తో జత కట్టారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి విజయ్‌తో రొమాన్స్ చేయనున్నారనే ప్రచారంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..