Pooja Hegde : చంపేస్తామని బెదిరింపులు.. క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే..
పూజా హెగ్డే.. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ స్టెప్పులేసి.. హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐతే ఇప్పుడు అమ్మడి టైమ్ అంతా బాగున్నట్లు కనిపించడం లేదు. కన్ఫర్మ్ అయిన సినిమాలు కూడా చేజారిపోతున్నాయి. ఐతే పూజా హెగ్డేకు హత్యా బెదిరింపులు అనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ విషయాన్ని పోస్ట్ చేయగా.. కాసేపట్లోనే అది వైరల్ అయింది.
పూజా హెగ్డే.. టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ స్టెప్పులేసి.. హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐతే ఇప్పుడు అమ్మడి టైమ్ అంతా బాగున్నట్లు కనిపించడం లేదు. కన్ఫర్మ్ అయిన సినిమాలు కూడా చేజారిపోతున్నాయి. ఐతే పూజా హెగ్డేకు హత్యా బెదిరింపులు అనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ విషయాన్ని పోస్ట్ చేయగా.. కాసేపట్లోనే అది వైరల్ అయింది. ఒక క్లబ్ ఓపెనింగ్ కోసం పూజా దుబాయ్ వెళ్లగా.. అక్కడే ఏదో గొడవ జరిగిందని.. తను బెదిరింపులకు గురయిందని ఆ పోస్ట్‌లో ఉంది. దీంతో పూజా ఫ్యాన్స్ కలవరపడ్డారు. జాగ్రత్తగా ఇండియాకు తిరిగిరమ్మంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. క్లబ్ ఓపెనింగ్ కోసం పిలిచినప్పుడు తిరిగి జాగ్రత్తగా పంపించే బాధ్యత ఉండదా అంటూ మరో ఫ్యాన్ ఫైర్ అయ్యారు.
అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి పూజా హెగ్డేను కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు చాలామంది. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడానికి తన టీమ్ ముందుకొచ్చింది. ఈ ప్రచారాన్ని పూజా టీమ్ కొట్టిపారేసింది. ఈ వార్తను ఎవరు మొదలుపెట్టారో తెలియదుని.. ఐతే ఇది అసలు నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. అసలు అలాంటి సంఘటన ఏమీ జరగలేదు అంటూ వివరణ ఇచ్చింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ పోస్ట్ కూడా డిలీట్ అయింది. ఇదంతా ఫేక్ అని తెలియడంతో ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు. ప్రస్తుతం పూజా హెగ్డే అప్‌కమింగ్ సినిమాలపై క్లారిటీ లేదు. అసలు తన చేతిలో ఆఫర్లు ఉన్నాయో లేదో తెలియదు. ఇలాంటి సమయంలో ఈ హత్యా బెదిరింపులు అనే ఫేక్ న్యూస్ వైరల్ కావడంతో.. ఆమె ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.