Bigg fight : బాక్సాఫీస్ ఫైట్‌లో ముగ్గురు హీరోలు
టాలీవుడ్ (Tollywood) లో ఈ సారి దసరా (Dussehra) కు టఫ్ తప్పేలా లేదు... దసరా రిలీజ్ పై ఇప్పటి నుండే పలు సినిమాల మేకర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. మెయిన్‌గా ఈ దసరాలో విడుదలకు మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులోనూ మూడూ భారీ సినిమాలు.. ఎవరికి ఎవరూ తీసిపోరు.. అందులో ఒకరు బాలకృష్ణ, మరొకరు జూనియర్ ఎన్టీఆర్ కాగా.. ఇంకొకరు నాగ చైతన్య.. ఈ ముగ్గురి సినిమాలూ దసరా బరిలో దిగబోతున్నట్లు గట్టి టాక్ వినిపిస్తోంది..

Three heroes in box office fight
టాలీవుడ్ (Tollywood) లో ఈ సారి దసరా (Dussehra) కు టఫ్ తప్పేలా లేదు… దసరా రిలీజ్ పై ఇప్పటి నుండే పలు సినిమాల మేకర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. మెయిన్‌గా ఈ దసరాలో విడుదలకు మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులోనూ మూడూ భారీ సినిమాలు.. ఎవరికి ఎవరూ తీసిపోరు.. అందులో ఒకరు బాలకృష్ణ, మరొకరు జూనియర్ ఎన్టీఆర్ కాగా.. ఇంకొకరు నాగ చైతన్య.. ఈ ముగ్గురి సినిమాలూ దసరా బరిలో దిగబోతున్నట్లు గట్టి టాక్ వినిపిస్తోంది.. అదే నిజమైతే.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షంతో పాటు గట్టి క్లాష్ కూడా తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) ల దేవర పార్ట్ -1 (Devara Part 1) మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఇక నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) ల కలయికలో చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న తండేలా కూడా దసరా బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. తండేల్ దసరాకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇటీవల డైరెక్టర్ చందూ ఆల్‌మోస్ట్ కన్‌ఫామ్ చేశారు. ఇక.. టెస్ట్ టాలీవుడ్ న్యూస్ ప్రకారం నటసింహం బాలకృష్ణ తో బాబీ తెరకెక్కిస్తున్న యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ కూడా దసరా బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది.
దేవర మూవీపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ఎన్టీఆర్ లుక్, గ్లింప్స్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టించాయి. ఇక.. ఇప్పటి వరకూ చేయని జోనర్‌లో తండేల్‌గా వస్తున్న నాగ చైతన్య.. తన లుక్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేశాడు.. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోరు మీదున్న బాలయ్య.. దసరా బరిలో ఈ ఇద్దరి కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరి.. ప్రస్తుతం టాక్ నడుస్తున్నట్లుగా ఈ ముగ్గురు హీరోలూ దసరా బరిలో దిగితే.. మూడు బడా మూవీస్ మధ్య బాక్సాఫిస్ క్లాష్ తప్పదంటున్న టాక్ వినిపిస్తోంది. మరి.. దసరా బరిలో ఎవరి రచ్చ ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే..