YRF Spy Universe: ముగ్గురు సూపర్ స్టార్లు ఒకేసారి.. దద్దరిల్లిపోనున్న థియేటర్స్
సౌత్ ఇండియా (South India) లో లోకేష్ కనకరాజ్ (Kanakaraj) సినిమాటిక్ యూనివర్స్ ఎంత పేరు తెచ్చుకుందో నార్త్ ఇండియాలో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) కి అంత పేరు ఉంది.

Three superstars at the same time Theaters are roaring
ముగ్గురు పాపులర్ హీరోలు (Popular Heroes) ఒకేసారి స్క్రీన్ పైన కనిపిస్తే ఇక అభిమానుల హడావిడి చెప్పాలా ఒకప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు విపరీతంగా వచ్చేవి. ఆ తరువాత ఆ ట్రెండ్ అనేది చాలా రోజులు మరుగున పడిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ ఒక హీరో సినిమాలో మరొక హీరో కనిపించడం సాధారణమైపోయింది. దీనికి తోడు ప్రస్తుతం సినిమాటికి యూనివర్స్ లు కూడా మన ఇండియాలో పాపులర్ అవుతున్నాయి.
Varun Tej: ఓటీటీలో వరుణ్-లావణ్య పెళ్లి.. అమ్మో.. డీల్ అన్ని కోట్లా..
సౌత్ ఇండియా (South India) లో లోకేష్ కనకరాజ్ (Kanakaraj) సినిమాటిక్ యూనివర్స్ ఎంత పేరు తెచ్చుకుందో నార్త్ ఇండియాలో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ (YRF Spy Universe) కి అంత పేరు ఉంది. ఇక ఈ యూనివర్స్ లో భాగంగా వచ్చిన షారుక్ ఖాన్ పఠాన్ లో షారుఖ్ ఖాన్ తో పాటు సల్మాన్ ఖాన్ కేవలం కాసేపు కనిపించినందుకే.. అప్పట్లో ఆ సీన్ సెన్సేషన్ సృష్టించింది. నార్త్ సైడ్ థియేటర్లు మోతెక్కిపోయాయి. ఆ సినిమా సక్సెస్ లో ఈ ఎపిసోడ్ షేర్ ని తక్కువ చేసి చెప్పలేం.
ఇక అలా షారుఖ్ ఖాన్ సినిమా సక్సెస్ లో భాగమయ్యారు సల్మాన్ ఖాన్. కాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమా సక్సెస్ కోసం షారుక్ అలానే మరొక హీరో కూడా సహాయం చేయాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం వైఆర్ఎఫ్ స్పై సిరీస్ లో వస్తోన్న మరో సినిమా టైగర్ 3. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ స్పెషల్ క్యామియో చేస్తున్నట్లు తెలుస్తోంది. టెర్రిఫిక్ అనిపించే ఒక యాక్షన్ ఛేజ్ లో మరోసారి సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇరగదీయ్యడానికి సిద్ధమైపోయారట. ఈ సీన్ లో ఇద్దరు కలిసి బైకు మీద వెళుతూ ఆ తర్వాత రకరకాల విన్యాసాలతో విలన్ ఇమ్రాన్ ఆష్మి గ్యాంగ్ కి ముచ్చెమటలు పట్టిస్తారట. ఈ వార్త బయటకి వచ్చిన దగ్గర నుంచి ప్రేక్షకులు ఈ సీన్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు.