వణుకుతున్న ముగ్గురు మొనగాళ్లు… ప్రభాస్, ఎన్టీఆరే సేఫ్…

పాన్ ఇండియా సినిమా అంటే టాలీవుడ్ హీరోలకే సొంతం అన్నట్టు సీన్ మారిపోయింది. రెబల్ స్టార్ 5 పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 31, 2025 | 07:30 PMLast Updated on: Mar 31, 2025 | 7:30 PM

Three Trembling Heads Prabhas Ntr Are Safe

పాన్ ఇండియా సినిమా అంటే టాలీవుడ్ హీరోలకే సొంతం అన్నట్టు సీన్ మారిపోయింది. రెబల్ స్టార్ 5 పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రెండు పాన్ ఇండియా హిట్లు పట్టేశాడు. అల్లు అర్జున్ కూడా రెండు పాన్ఇండియా హిట్లు పట్టాడు. కాని మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు చేసేందుకు టెన్షన్ పడుతున్నాడు. చరణ్ ఆల్రెడీ పాన్ ఇండియా లెవల్లో రెండు సార్లు ఫెల్యూర్స్ ఫేస్ చేశాడు. ఇక కేజీయఫ్ స్టార్ రాఖీ భాయ్ అయితే, టాక్సీక్ తో పాన్ ఇండియాని షేక్ చేయాలని అనుకుంటున్నాడు. కాని ఏంజరుగుతుందో సినిమా వస్తే కాని చెప్పలేం. కాకపోతే కామన్ గా ఈ ముగ్గురు హీరోల్లోనే పాన్ ఇండియా టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. రెబల్ స్టార్ రిలాక్స్ డ్ గా నే ఉన్నాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అయితే జపాన్ లో పండగ చేసుకుంటున్నాడు.. ఇంతకి వీళ్ల కాన్ఫిడెన్స్ కి, ఆ ముగ్గురు హీరోల కంగారుకి కారణమేంటి? హావేలుక్

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి1, బాహుబలి 2 తర్వాత సాహోతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. సౌత్ లో అది అంతగా ఆడకున్నా, నార్త్ ని కుదిపేసింది. తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్ అవటం వల్లే ప్రభాస్ రేంజ్ ఏంటో తేలింది. బేసిగ్గా హిట్టైతే హీరో స్టామినా తెలుస్తుంది.. కాని ఫ్లాప్ అవటం వల్లే రెబల్ స్టార్ రేంజ్ ఏంటో అందరికి అర్ధమైంది.రాధేశ్యామ్ ఫ్లాపైనా 400 కోట్ల వరకు వసూళ్లొచ్చాయి. అంటే పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. కాని వెయ్యికోట్ల స్టామినా ఉన్న హీరోకి ఇంతే రావటం కంటెంట్ వీక్ గా ఉండటం వల్లే అన్నారు. ఆదిపురుష్ అయితే దర్శకుడు, రైటర్ మీద భారీ గా ట్రోలింగ్ జరిగేంతగా రిజల్ట్ రివర్స్ అయ్యింది. అంత ఫ్లాపైనా 650 కోట్ల పెట్టుబడిని 700 కోట్లతో గట్టెక్కించాడు ప్రభాస్. సో ఓ సినిమా ఫ్లాపైనా ఈ రేంజ్ లో వసూల్లు వస్తున్నాయంటే,అదే ప్రభాస్ మార్కెట్ అన్నారు.

అన్నట్టుగానే, కంటెంట్ బాగుండే బాక్సాపీస్ బద్దలే అని సలార్ తో ప్రూవ్ అయ్యింది. అది 800 కోట్లు రాబడితే, కల్కీ 1200 కోట్లు రాబట్టింది. ఫైనల్ గా హిట్ ప్లాప్ అనే స్టేజ్ దాటేశాడు ప్రభాస్. తన సినిమా వస్తే చాలు ఆడియన్స్ కి పండగే… రిజల్ట్ గురించి ఆలోచించే స్టేజ్ ని ఎప్పుడో ఓవర్ కమ్ చేశాడు రెబల్ స్టార్.అచ్చంగా ఇదే ఇమేజ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి వచ్చేసినట్టుంది. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తో రాజమౌళి వల్లే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ గ్లోబల్ గా ఫోకస్ అయ్యారన్నారు. అలాంటి టైంలో దేవర వచ్చింది. రాజమౌళి సపోర్ట్ లేకుండా 670 కోట్లు తను రాబట్టడమే కాదు, రాజమౌళి తో హిట్ పడ్డాక ఏ హీరోకైనా ఫ్లాపులు పడాల్సిందే అన్న సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేశాడు.

ఇక జపాన్ లో అయితే దేవర ప్రివ్యూ వేస్తే 8 లక్షల మంది చూశారు. ఇప్పుడు అక్కడ సినిమా ని రిలీజ్ చేస్తే జనాలు వరదలై వస్తున్నారు. అక్కడ కూడా దేవర ఫస్ట్ డే నే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇవన్నీ కాకుండా హిందీ మూవీ వార్ 2 లో తను విలన్ అనగానే బాలీవుడ్ లో ఫోకస్ అంతా తన మీదే పడింది. హ్రితిక్ కి వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టేంతగా తనే సపోర్ట్ ఇస్తున్నాడనంటున్నారు.అంతగా నార్త్ ఇండియాలో ఊర మాస్ ఇమేజ్ ఎన్టీఆర్ సొంతమైంది.. సో పాన్ ఇండియా లెవల్లో వార్ 2, డ్రాగన్, దేవర 2 ఇలా ఏవొచ్చినా వెయ్యికోట్ల వరద చాలా కామన్ గా మారే అంశం..లానే ప్రభాస్ ఫౌజీ, ది రాజాసాబ్, స్పిరిట్ వీట్లో ఏదొచ్చినా వెయ్యికోట్ల వరద చాలా సాధారణ విషయం.. అందుకే వీళ్లు పాన్ ఇండియా మార్కెట్ లో సక్సెస్ , ఫెల్యూర్స్ కి అతీతులయ్యారు.

ఎటొచ్చి కేజీయఫ్ రెండు భాగాలతో దుమ్ముదులిపిన కన్నడ స్టార్ యష్ కే టాక్సిక్ మూవీతో అగ్నిపరీక్ష ఎదురౌతోంది. ఆచార్య, గేమ్ ఛేంజర్ ఫ్లాపులతో ఇప్పుడు పెద్ది మూవీ మీదే భారం పడుతోంది. ఎన్టీఆర్ లా చరణ్ కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవల్సివస్తోంది. పుష్ప రెండు భాగాలు హిట్టైనా, బన్నీ తన నెక్ట్స్ రెండు మూవీల విషయంలో కంగారు పడాల్సి వస్తోంది. ఈ ముగ్గురు ప్రభాస్, ఎన్టీర్ లా కూల్ గా సినిమాలు చేసే పరిస్థితి రావాలంటే, గతంలో హిట్లు ఇచ్చిన దర్శకుల సపోర్ట్ లేకుండా, సోలోగా తామెంటో ప్రూవ్ చేసుకోవాలి… అది అసలైన అగ్ని పరీక్ష.