100 cores heros : 100 కోట్ల లిస్టులో టైర్-2 హీరోలు
ఒకప్పుడు హిట్ సినిమా అంటే.. యాబై రోజులో, వంద రోజులో ఊడేది. కానీ ఇప్పుడు ఆట్రెండ్ కు కాలం చెల్లిపోయింది.
ఒకప్పుడు హిట్ సినిమా అంటే.. యాబై రోజులో, వంద రోజులో ఊడేది. కానీ ఇప్పుడు ఆట్రెండ్ కు కాలం చెల్లిపోయింది. ఇప్పుడంతా షార్ట్ కట్.. ఎన్ని రోజులు ఆడిందన్నది కాదు.. వంద కోట్లు కలెక్ట్ చేసిందా లేదా అన్నది మార్క్ గా మారింది. అందుకే ఆ మైల్ స్టోన్ ను అందుకునేందుకు తెలుగు హీరోలు కష్టపడుతున్నారు.
టాలీవుడ్ (Tollywood) లో 100 కోట్ల వసూళ్లు అనేది ప్రస్తుతం కామనైపోయింది. స్టార్ హీరోల సినిమాలైతే అవలీలగా ఆ స్థాయి కలెక్షన్లు సాధించేస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది హీరోలు ఈ రికార్డును సాధించారు. వారే కాదు ఈ మధ్యకాలంలో కొందరు మీడియం రేంజ్ హీరోలు హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లోకి చేరారు. దీంతో ఆ రికార్డును సాధించాలని మిగిలిన హీరోలకు కోరికపుడుతోంది. ఎలాగైనా సరే తాము కూడా ఆ ఫీట్ ను సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అప్ కమింగ్ మూవీలకే అదే టార్గెట్ గా పెట్టుకున్నారు.
చిరంజీవి(Chiranjeevi), బాలయ్య (Balayya) లాంటి వారు ఎప్పుడో వంద కోట్ల వసూళ్ల జాబితాలో చేరిపోగా.. ఆతర్వాత కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాతో నిఖిల్, దసరాతో నాని, ధమాకాతో రవితేజ, గీతా గోవిందంతో విజయ్ దేవరకొండ, తాజాగా టిల్లు స్క్వేర్ తో సిద్దు జొన్నలగొడ్డ ఈ ఫీట్ సాధించారు. నిఖిల్ ,నాని లు పాన్ ఇండియా రిలీజ్ లతో ఆ రికార్డు కొడతే.., ఒక్క తెలుగు లాగ్వేంజ్ లోనే రవితేజ, సిద్దు , విజయ్ లు వందకోట్ల మార్క్ అందుకుని కొత్త చరిత్ర సృష్టించారు వారిని చూసి అదే స్థాయిలో ఉన్న హీరోలు కూడా రేసులోకి వస్తున్నారు. వందకోట్ల లిస్ట్ లో చేరెందుకు ఉత్సాహాపడతున్నారు.
టైర్-2 హీరోల లిస్టులో వంద కోట్ల క్లబ్లోకి చేరాలని ఆరాటడపడుతున్న హీరోలు చాలా మందే కనిపిస్తున్నారు. ముఖ్యంగా యువ సామ్రాట్ నాగచైతన్య ఈ ఫీట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఒక స్థాయి స్టార్ డమ్ ను సంపాదించుకున్న హీరోలైన ,అడవి శేష్ , నవీన్ పోలిశెట్టి లాంటి యంగ్ స్టర్స్ కూడా ఈ ఫీట్ సాధించాలని బలంగా కోరుకుంటున్నారు. వారి తదుపరి ప్రాజెక్టులను అదే స్థాయిలో కలెక్షన్లు సంపాదించే విధంగా మేకింగ్ చేసుకుంటున్నారు. మరి చూడాలి ఈ హీరోలు వంద కోట్ల క్లబ్ లోకి ఎప్పుడు చేరతారో..