Jr NTR: ఈ దీపావళికే రానున్న యంగ్ టైగర్ తొలి హిందీ సినిమా..?

తారక్ ఫస్ట్ టైం హిందీలో నటించిన తొలి బాలీవుడ్ మూవీ దీపావళికి రిలీజ్ కాబోతోంది. ఈ వింతకి మరో నెలే టైమే మిగిలి ఉంది. వార్ 2 మూవీ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.. డిసెంబర్‌లో మొదలైనా అది రావటానికి ఏడాదికి పైనే టైం పట్టే ఛాన్స్ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 3, 2023 | 08:09 PMLast Updated on: Oct 03, 2023 | 8:09 PM

Tiger 3 Star Salman Khan To Share Screen With Jr Ntr In War 2 Here Is The Details

Jr NTR: దీపావళికి ఎన్టీఆర్ కొత్త మూవీ.. అందులోనూ తన ఫస్ట్ డైరెక్ట్ హిందీ సినిమా వస్తే ఎలా ఉంటుంది. నార్త్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కూడా షేక్ అవ్వాల్సిందే. అదే ఇప్పుడు జరగబోతోంది. తారక్ ఫస్ట్ టైం హిందీలో నటించిన తొలి బాలీవుడ్ మూవీ దీపావళికి రిలీజ్ కాబోతోంది. ఈ వింతకి మరో నెలే టైమే మిగిలి ఉంది. వార్ 2 మూవీ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.. డిసెంబర్‌లో మొదలైనా అది రావటానికి ఏడాదికి పైనే టైం పట్టే ఛాన్స్ ఉంది. అయినా ఈలోపు తారక్ హిందీ మూవీ రాబోతోందంటేనే సర్‌ప్రైజింగ్‌గా ఉంది.

నిజానికి త్రిబుల్ఆర్‌తో పాన్ ఇండియా లెవల్లో ఫోకస్ అయిన ఎన్టీఆర్ ఇంతవరకు డైరెక్ట్‌గా హిందీ మూవీ చేయలేదు. త్రిబుల్ఆర్ ఎంత పాన్ ఇండియా మూవీ అయినా డబ్బింగ్ రూపంలోనే అక్కడ విడుదలైంది. మరి దీపావళికి తారక్ తొలి హిందీ సినిమా రాబోతోందనే అంశమే ఫ్యాన్స్‌ని ఎగ్జైట్ చేసేలా ఉంది. ఆ ఫీట్ సల్మాన్ ఖాన్ వల్లే సాధ్యం కాబోతోంది. బేసిగ్గా ఈ కండల ఖాన్‌కి ఎన్టీఆర్ అభిమాని. అందుకే సల్మాన్ భాయ్ అడిగాడని తనకోసం ఓ చిన్న సాయం చేశాడట. అదే తన కొత్త మూవీ టైగర్ 3లో గెస్ట్ రోల్ వేసేందుకు ఒప్పుకోవటం.

టైగర్ 3 క్లైమాక్స్ రీ షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. పఠాన్‌లో షారుఖ్ కోసం సల్మాన్ గెస్ట్ రోల్ వేశాడు. ఇప్పడు కింగ్ ఖాన్ వంతొచ్చింది. సల్మాన్ కోసం షారుఖ్ గెస్ట్‌గా కనిపించాల్సి ఉంది. అయితే ఆ సీన్‌లో చిన్న రీపేర్లు చేసి, మరో గెస్ట్‌గా తారక్‌ని తీసుకుంటున్నారట. సో.. ఈ నెలలో ఆ సీన్ షూటింగ్ అయిపోతే.. దీపావళికి ఆ మూవీ వస్తే.. ఇదే ఎన్టీఆర్ మొదటి డైరెక్ట్ హిందీ సినిమా అనుకోవాల్సి వస్తుంది.