Devara : గిరిజన నాయకుడు.. ఊచకోత మామూలుగా ఉండదు
దేవర సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు ఇస్తున్న హైప్ చూసి.. పండగ చేసుకుంటున్నారు టైగర్ ఫ్యాన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేవర దండయాత్రను బాక్సాఫీస్ తట్టుకోవడం కష్టమే.. అని అంటున్నారు.

Tiger fans are celebrating after seeing the hype given by everyone who worked on Devara movie.
దేవర సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరు ఇస్తున్న హైప్ చూసి.. పండగ చేసుకుంటున్నారు టైగర్ ఫ్యాన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేవర దండయాత్రను బాక్సాఫీస్ తట్టుకోవడం కష్టమే.. అని అంటున్నారు. కొరటాల కూడా ఈసారి మృగాల వేట చూస్తారని చెబుతున్నాడు. దీంతో.. దేవర పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. ఇక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇచ్చిన హైప్ మాత్రం మామూలుగా లేదు.
ప్రస్తుతం ‘దేవర’ రీ-రికార్డింగ్‌తో బిజీగా ఉన్నాడు అనిరుధ్. అయితే.. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ మాట్లాడుతూ.. ‘దేవర’ ఒక అద్భుతమైన సినిమా అని చెప్పుకొచ్చాడు. కొరటాల శివ సరికొత్త స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు సినేరియా కొత్తగా ఉంటుంది. ఇది ఒక సముద్ర ప్రాంతానికి చెందిన గిరిజనుల నేపథ్యంలో సాగే కథ.. అని తెలిపాడు. అంటే.. గిరిజన తెగ నాయకుడుగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడన్నమాట. దీంతో.. దేవర మామూలుగా ఉండదని అంటున్నారు నందమూరి అభిమానులు.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌లో.. దేవర ఊచకోతకు ఎరుపెక్కిన సముద్రాన్ని చూపించాడు కొరటాల. టీజర్, సాంగ్‌లో దేవర ఆయుధాలు మామూలుగా లేవు. అనిరుధ్ కూడా ఫస్ట్ సింగిల్‌తో కుమ్మేశాడు. దీంతో.. దేవర కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పటికే దేవర పార్ట్ 1 షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదే నెలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. సెప్టెంబర్ 27న దేవర మొదటి భాగం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మరి అంచనాలకు తగ్గట్టుగా దేవర ఉంటుందో లేదో చూడాలి.