Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వర రావుకు కోత.. ఎన్ని నిమిషాలు కట్ చేశారంటే..
సెకండాఫ్‌లో కూడా మంచి సన్నివేశాలున్నప్పటికీ, నిడివి ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయారనే ప్రచారం మొదలైంది. దీంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్ సినిమా నిడివి తగ్గించింది. సినిమా సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ప్రేక్షకులకు రిపీటెడ్‌గా అనిపించి, వారి సహనానికి పరీక్షలా నిలిచాయి.
Tiger Nageswara Rao: మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వర రావు. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఫస్టాఫ్ బాగున్నప్పటికీ సెకండాఫ్ నిడివి ఎక్కువైందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. సెకండాఫ్‌లో కూడా మంచి సన్నివేశాలున్నప్పటికీ, నిడివి ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయారనే ప్రచారం మొదలైంది.
దీంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్ సినిమా నిడివి తగ్గించింది. సినిమా సెకండాఫ్‌లో కొన్ని సీన్లు ప్రేక్షకులకు రిపీటెడ్‌గా అనిపించి, వారి సహనానికి పరీక్షలా నిలిచాయి. దీంతో అలాంటి సీన్లను తాజాగా తొలగించారు. మొత్తంగా 25 నిమిషాల నిడివి తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిడివి మొదట 03:01 నిమిషంగా ఉండేది. అయితే, అప్పుడు నిడివి ఎక్కువైందని భావించిన యూనిట్ కొంత సినిమాను కట్ చేసి రిలీజ్ చేశారు. అయితే, రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన తర్వాత మరింత నిడివి తగ్గించారు. ప్రస్తుతం సినిమా రన్ టైం 02:37 నిమిషాలుగా ఉంది. ఇది ఒక సినిమాకు మంచి రన్ టైంగానే చెప్పాలి. దీనివల్ల ప్రేక్షకులకు కథ సాగదీతగా అనిపించదు. దీంతో ప్రేక్షకులకు ఈ సినిమా మరింత నచ్చుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.
స్టువర్ట్‌పురం దొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. చాలా రోజుల తర్వాత రవితేజ పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమా చేశారని ప్రేక్షకులు అంటున్నారు. విక్రమార్కుడు తర్వాత ఆ స్థాయిలో ఈ చిత్రంలోని పాత్ర ఉందని పేరొచ్చింది. ఈ సినిమా ఫుల్ రన్‌లో బాక్సాఫీస్ దగ్గర ఎలా నిలబడుతుందో చూడాలి.