Tillu 3 : టిల్లు స్క్వేర్ హిట్‌తో టిల్లు 3

టిల్లు స్క్వేర్‌తో టాలీవుడ్ (Tollywood) వేసవి వినోదం మొదలైంది..'డీజే టిల్లు'గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) .. టిల్లు స్క్వేర్ (DJ Sequel) గా ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేశాడు.. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంలో ఏ మాత్రం తగ్గలేదు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 30, 2024 | 02:30 PMLast Updated on: Mar 30, 2024 | 2:30 PM

Tillu 3 With Tillu Square Hit

టిల్లు స్క్వేర్‌తో టాలీవుడ్ (Tollywood) వేసవి వినోదం మొదలైంది..’డీజే టిల్లు’గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) .. టిల్లు స్క్వేర్ (DJ Sequel) గా ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేశాడు.. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంలో ఏ మాత్రం తగ్గలేదు.. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా ‘డీజే టిల్లు’ (DJ Tillu) కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా మార్చి 29న రిలీజై హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. దీంతో.. పార్ట్-2 విడుదలైన రోజే మేకర్స్ పార్ట్-3పై ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.

టిల్లు పాత్ర మ‌రోసారి పండ‌డం.. అందులో సిద్ధు జొన్నల‌గ‌డ్డ పెర్ఫామెన్స్ అదిరిపోవ‌డం.. డైలాగులు ట‌పాసుల్లా పేల‌డంతో టిల్లు స్క్వేర్ థియేట‌ర్ల‌లో కోలాహ‌లం క‌నిపిస్తోంది..ఇక.. ‘టిల్లు స్క్వేర్’ మంచి స్పందన లభిస్తుండటంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి.. తమ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. ఈ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్ల‌లో టిల్లు స్క్వేర్ నిర్మాత సూర్యదేవ‌ర నాగ‌వంశీ అస‌లు విష‌యం చెప్పాడు. టిల్లు-3 ఉంటుంద‌ని.. దాని గురించి హింట్ సినిమాలో పెట్టడం కుద‌ర‌లేద‌ని వెల్లడించాడు. వీకెండ్ అయ్యాక సినిమాలో ఆ బిట్ యాడ్ చేస్తామ‌ని.. సోమ‌వారం నుంచి మూడో పార్ట్ గురించి కొస‌మెరుపు ఉంటుంద‌ని చెప్పాడు.

ఈ అనౌన్సమెంట్‌తో టిల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.. కాగా తొలి రోజు టిల్లు స్క్వేర్‌కు 25 కోట్ల మేర గ్రాస్ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.. మరో వైపు ఫుల్ ర‌న్‌లో ఈ సినిమా వంద కోట్ల మార్కును అందుకుంటుంద‌ని వంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. కాగా ప్రస్తుతం సిద్ధు చేతిలో ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల తర్వాత ‘టిల్లు-3’ని పట్టాలు ఎక్కిస్తారేమో చూడాలి.. మొత్తానికి ఏది ఏమైనా టిల్లు 3 ఎనౌన్స్‌మెంట్స్‌తో హిట్ సినిమాకి వరుస సీక్వెల్స్‌ ఫార్ములాని సిద్దు కూడా పర్‌ఫెక్ట్‌గా ఫాలో అయిపోతున్నాడన్నమాట..